WorldWonders

జలియన్‌వాలాబాగ్ ఉదంతానికి నూరేళ్లు

jalian wala bhag massacre turns 100

ఓ భార్య తన భర్త శవాన్ని పట్టు కొని ఏడుస్తోంది.. ఓ తండ్రి 13 ఏళ్ల తన కొడుకు మృతదేహంకోసం ఆవేదనగా వెతుకుతున్నాడు.. చనిపోయిన 12ఏళ్ల బాలుడు మరో 3 ఏళ్ల పిల్లాడిని చేయి పట్టు కునేఉన్నాడు.. ఆ మూడేళ్ల పిల్లాడూ చనిపోయాడు.. ఎక్కడచూసినా మృతదేహాలు, క్షతగాత్రులు, కొనప్రాణంతో కొట్టు మిట్టాడుతున్నవారు, గుక్కెడు నీళ్ల కోసం కలవరిస్తున్న వారు.. ఇలా కళ్లు చెమర్చే దృశ్యాలెన్నో..1919 నాటి జలియన్‌ వాలా బాగ్‌ దురంతానికి సాక్ష్యాలివి.. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలోజరిగిన అత్యం త అమానవీయమైన సంఘటనల్లో ఇదీఒకటి. అమాయక చిన్నారులు, మహిళలు, యువకులను పొట్టనబెట్టు కున్న చీకటి రోజది. దేశం మొత్తంఆవేదనతో రగిలిపోయిన దురంతమది.
**కిచ్లూ, సత్యపాల్‌ అరెస్టులకు నిరసనగా..
అది స్వాతంత్రోద్యమ కాలం. బ్రిటిషర్లు 1919లోరౌలత్‌ చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా, కోర్టు తీర్పు చెప్పకుం డాప్రభుత్వం నిర్బంధించొచ్చు. దీంతో జాతీయవాదులు ‘రౌలత్‌ సత్యాగ్రహం’ చేపట్టారు. ఎక్కడ చూసినసభలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు,హర్తాళ్లు. ఆందోళనను అణచాలని ప్రభుత్వం గాంధీని అరెస్టు చేసింది. పంజాబ్‌ లో ముఖ్య నాయకులు సైఫుద్దీన్‌ కిచ్లూ, డాక్టర్‌ సత్యపాల్‌ ను రాష్ ట్రం నుంచి బహిష్కరించి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లింది. దానికివ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అమృత్‌ సర్‌ప్రజలు 1919 ఏప్రిల్‌ 13 వైశాఖీ పండుగ రోజునజలియన్‌ వాలా బాగ్‌ కు చేరుకున్నారు.
**బులెట్లు అయిపోయే వరకు..
6.5 ఎకరాల స్థలంలో ఉంది బాగ్‌ . మూడు వైపులాభవనాలు.. లోపలికి ప్రవేశించా లన్నా, బయటికిరావాలన్నా ఒకే దారే. సాయంత్రం నాలుగున్నరకుసభ ఉన్నట్టు పంజాబ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డయ్యర్‌ కుతెలిసింది. వేలాదిగా పిల్లాపాపలు, ముసలివాళ్లు,మహిళలు కుటుంబ సమేతంగా బాగ్‌ కు వచ్చారు.లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాల మేరకు బాగ్‌ కు వెళ్లినఅమృత్‌ సర్‌ సైనిక దళం అధికారి జనరల్‌ డయ్యర్‌కాల్పులకు ఆదేశాలిచ్చాడు. గుంపులు గుంపులుగాచెదిరిపోతున్న వారు లక్ష్యంగా కాల్పులు జరిపించా డు. గోడదూకి పారిపోదామనుకున్న వారినీ వదల్లేదు.చివరికి కింద పడుకున్న వారినీ మోకాళ్లపై నిల్చొనికాల్చారు. బులెట్లు అయిపోయే వరకు పది నిమిషాలు1,650 రౌండ్లు కాల్చారు. కాల్పుల నుంచి తప్పిం చుకోడానికి కొందరు బాగ్‌ లోని బావిలో దూకినాప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం379 మంది హతులయ్యారు. వెయ్యి మందికిపైగా మృతి చెందారని అనధికార లెక్కలంటు న్నాయి.తర్వాత బాగ్‌ కు తాళం వేశారు. ఆ ఘోరాన్ని ఎవరూచూడొద్దని అమృత్‌ సర్‌ కే తాళమేసినంత పని చేశారు. నగర ప్రజలెవరూ కొన్ని రోజులు బయటకు రాలేదు.కొన్ని నెలల తర్వాత మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌ లా ల్‌ నెహ్రూ అక్కడకు వెళ్లి కొన్ని ఫొటోలు తీసుకున్నారు.
**డయ్యర్లు.. రాక్షసులు
బాగ్‌ మారణకాండకు కారకులు ఇద్దరు. ఒకరుపంజాబ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మైఖేల్‌ ఓ డయ్యర్‌ .మరొకరు అమృత్‌ సర్‌ సైనిక పటాల బాధ్యుడుజనరల్‌ డయ్యర్‌ . లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డయ్యర్‌ మద్దతుతో మరో డయ్యర్‌ ఈ ఊచకోతకు తెరతీశాడు.బాగ్‌ మారణకాండ విచారణకు ముందే వారిద్దరినీపదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ వచ్చింది. కానీ ఓ డయ్యర్‌ ను చిన్నగా మందలిం చి విధులనుంచి తప్పించి బ్రిటిష్‌ ప్రభుత్వం ఇంగ్లం డ్‌ పంపింది. జనరల్‌ డయ్యర్‌ ను ప్రశంసలు, నగదు బహుమతులతో పంపిం ది. తర్వాత అక్కడే అనారోగ్యంతో అతడుమరణించాడు. లెఫ్ట్‌‌‌‌నెంట్‌ గవర్నర్‌ డయ్యర్‌ ను లండన్‌ లోనే ఉద్ధమ్‌ సింగ్‌ కాల్చి చంపాడు.
**వందేళ్ల సందర్భంగా పుస్తకం
బాగ్‌ దమనకాండ జరిగి వందేళ్లవుతోంది. ఈ సందర్భంగా బాగ్‌ ఉదంతం, అంతకుముందు జరిగినఘటనలను కళ్లారా చూసిన 40 మంది సాక్ష్యులనుంచి సేకరించిన సమాచారంతో లండన్‌ లోనిఇద్దరు సిక్కులు ‘ఐ విట్నెస్‌ ఎట్‌ అమృత్‌స ర్‌ఎవిజువల్‌ హిస్టరీ ఆఫ్‌‌‌‌ 1919 జలియన్‌ వాలాబాగ్‌మసకర్‌ ’ పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. 244 పేజీలఈ పుస్తకాన్ని రచయితలు అమన్‌ దీప్‌ సిం గ్‌ మద్ర, పరమ్‌ జీత్‌ సిం గ్‌ ఏప్రిల్‌ 13న విడుదల చేయబోతున్నారు.ఆ ఘటనకు సంబంధించిన 80 ఫొటోలను తొలిసారిపుస్తకంలో ప్రచురిస్తున్నారు.
**40 మందిని ఇంటర్వ్యూ చేసి..
‘బాగ్‌ లో తమ వారిని కోల్పోయిన, ఆ ఘటననుప్రత్యక్షంగా చూసిన వాళ్లలో సుమారు 40 మందినిఇంటర్వ్యూ చేశాం. వీళ్లం తా కాల్పులు జరిగినపుడుబాగ్‌ పక్కనో, పరిసరాల్లోనో ఉన్నావాళ్లే’ రచయితమద్ర చెప్పారు. పుస్తకంలో ముద్రించిన ఫొటోలనుహంటర్‌ కమిషన్, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ వేసినకమిషన్‌ , బ్రిటిషర్ల ప్రైవేట్‌ కలెక్షన్‌ , అమృసర్‌ లోనికుటుంబాల నుంచి తీసుకున్నామని చెప్పారు. ‘పుస్తకంలో కోట్‌ చేసిన సాక్ష్యులెవరూ ఎవరూ ఇప్పుడుజీవించిలేరు’ అన్నారు.