Kids

తెలంగాణా తెలుగు తప్పనిసరి పుస్తకాలు వచ్చేశాయి

compulsory telugu books released by telangana government

తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చదవాలన్న చట్టం నేపథ్యంలో వచ్చే ఏడాదికి పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ చట్టం గత విద్యా సంవత్సరం నుంచి అమలవుతోంది. తెలుగు అమలు ప్రతి ఏటా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో ఒక్కో తరగతి పెరుగుతూ వస్తుంది. గత విద్యా సంవత్సరం 1, 6వ తరగతి పుస్తకాలను రూపొందించగా.. ఈసారి 2, 7వ తరగతి పాఠ్య పుస్తకాలను ముద్రించారు. రెండో తరగతికి తేనె పలుకులు, 7వ తరగతికి వెన్నెల పేరిట పుస్తకాలను తయారు చేశారు. వీటిని ఇతర మాధ్యమాల విద్యార్థులు చదువుకోవాల్సి ఉంటుంది. తెలుగు మాతృభాష కలిగిన వారు సాధారణ తెలుగు పుస్తకాలే చదువుతారు. తెలుగేతరులు సులభంగా భాష నేర్చుకునేలా నిపుణులు ఈ పాఠ్య పుస్తకాలను ముద్రించారు. ఈ పుస్తకాలను రాష్ట్రంలోని 1100 తెలుగేతర పాఠశాలలతో పాటు కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, ప్రైవేట్‌ పాఠశాలల్లో వినియోగించాలి.