Kids

మనం చెప్పింది పిల్లలు చెయ్యరు.మనం చేసిందే పిల్లలు చేస్తారు.

kids wont listen but follow parents acts

“ఫిన్లాండ్” దేశం లో, ఓ ఖాళీ రోడ్, ఓ భారతీయుడు అలవాటుగా, సిగ్నల్ లేకుండా దాటబోయాడు. పక్కనే వున్న ఆ దేశంవ్యక్తి దాటవద్దు”అన్నాడు. మనవాడు “రోడ్డు ఖాళీకదా దాటితే యేం” అన్నాడు. అప్పుడా వ్యక్తి, “పిల్లలు ఎవరైనా చూస్తారేమో” అన్నాడు. మనవాడికి అర్ధం కాలేదు. “పోలీసులు చూస్తే సమస్య గానీ…. పిల్లలు చూస్తే సమస్య ఏంటి” అని అడిగాడు. పోలీసులు చూస్తే, నీకు క్రమశిక్షణ లేనందుకు, ఒక 5$ పెనాల్టీ వేస్తారు. కానీ పిల్లలు చూస్తే, వాళ్ళు క్రమశిక్షణ తప్పి ఒక తరం పాడవుతుంది” అని చెప్పాడు. మనవాడు తేరుకోడానికి కొద్దిగా టైము పట్టింది.అదీ భావితరాలను తయారు చేసే పద్ధతి. మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం యేంటీ అంటే..మనం చెప్పింది పిల్లలు చెయ్యరు.. మనం చేసిందే పిల్లలు చేస్తారు.