Health

అరటిపండుతో మలబద్ధకం పరార్

world banana day

అరటి.. ప్రపంచంలో ఎక్కువగా తినే పండు. అన్ని రకాల పండ్లు కొన్ని సీజన్స్‌లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి రోజు దొరుకుతాయి, అలా దొరికే పండ్లలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటి పండు. అరటి పండు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రోజు( ఏప్రిల్‌ 17) ప్రపంచ అరటి పండ్ల దినోత్సవం. ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ (ఐఎఫ్‌ఏడీ) అరటికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అవేంటో ఒక్కసారి చూద్దాం..అరటి పండ్లలో చాలా రకాలు ఉంటాయి. గ్రీన్‌ కలర్‌ అరటి పండ్లు, పసుపు రంగు అరటి, మచ్చల అరటి, బ్రౌన్‌ కలర్‌ అరటి. అయితే వీటిలో ఒక్కొ రంగు అరటి పండు ఒక్కో విధంగా ఉపయోగపడుతుందట. బాగా పండిన లేదా రంగుమారిన అరటి పండ్లను (బ్రౌన్‌ కలర్‌ అరటి) పడేయకూడదట. వాటిని తినడం వల్ల ఒత్తిడి, ఆందోళ తగ్గుతుంది. బ్రౌన్‌ కలర్‌ అరటి పండ్లలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని జ్యూస్‌ చేసుకొని తాడగం కానీ బానానా బ్రెడ్‌గా చేసుకొని తింటే మంచిదని చెబుతున్నారు. ఇక గ్రీన్‌ కలర్‌ అరటి పండ్లు షుగర్‌ పెరగకుండా కాపాడుతాయి. ఈ కలర్‌ అరటి పండ్లు నెమ్మదిగా జీర్ణమవుతాయ. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్‌ పరిమాణం నెమ్మదిగా పెరుగుతాయి. ఇక పసుపు రంగు అరటి పండ్ల తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తినడం చాలా రోగాలు మనకు సోకవట. ఇవి చాలా సులభంగా జీర్ణమై బలాన్ని ఇస్తాయట. మచ్చలు ఉన్న అరటిలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో అనేక అనామ్లజనకాలు ఉంటాయి. ఈ కలర్‌ అరటి పండు చాలా రుచికరంగా ఉంటుంది కానీ మిగతా అరటి పండ్ల కంటే వీటిలో పోషకాలు కాస్త తక్కువట. అరటి పండు తినటం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు కలుగుతాయి, మనకి అరటిపండ్లు చాలా సులభంగా దొరుకుతాయి కాబట్టి ప్రతిరోజు ఒక్క అరటిపండు అయిన తింటే చాలా ఆరోగ్య సమస్యల నుండి మనం తప్పించుకోవచ్చు.

*** అరటి పండ్ల తినడం వల్ల కలిగే మరిన్ని ఉపయోగాలు
అరటి పండులో విటమిన్స్,మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. హార్ట్ సమస్యలు, యాసిడిటి సమస్యలను అరటి తొందరగా అరికడుతుంది. ఈ పండు తినడం వలన జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా ఎసిడిటిని ఎక్కువగా తగ్గిస్తుంది. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా డటంవలన బ్లెడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. ప్రతి రోజు అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి అనీమియాను రాకుండా చేస్తుంది. ఇందులో ఎక్కువగా విటమిన్స్ ఉండటం వలన కంటి చూపుకు కూడా చాలా పనిచేస్తుంది. మచ్చలున్న అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయి. మలబద్దకం ఎక్కువగా ఉన్నవారికి ఒక నెల రోజులు కచ్చితంగా తినిపిస్తే వారికి ఇక ఆ సమస్య ఉండదు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి అది మలబద్దకాన్ని నివారిస్తుంది.