Fashion

అమ్మాయిలూ…వేసవిలో ఈ టీషర్టులపై ఓ లుక్కేయండి

summe tshirt fashion for ladies

* క్యాజువల్‌గా కనిపించాలనుకునేవారికి రౌండ్‌నెక్‌ టీషర్టులు బాగా నప్పుతాయి. ఆకట్టుకునేలా కనిపిస్తాయి.
* స్నేహితులతో సినిమాలు, విహారయాత్రలకు వెళ్లేవారికి ఫుల్‌ స్లీవ్స్‌, టర్టిల్‌నెక్‌ ఉన్న టీషర్ట్‌లు బాగా సరిపోతాయి. సౌకర్యంగా ఉంటాయి. ట్రెండీలుక్‌నీ తెస్తాయి. దీనిపైకి జాగర్స్‌, జెగ్గింగ్స్‌ అదిరే లుక్‌ను తెచ్చిపెడతాయి.
* సన్నగా, పొడుగ్గా ఉన్నవారికి టీషర్ట్‌ మంచి ఎంపిక. ఇలాంటివారు మెడభాగం కాస్త విశాలంగా ఉన్న సాదా షార్ట్‌ టీషర్టు ఎంచుకోవాలి. వాటిపైకి స్కిన్నీ జీన్స్‌, యాంకిల్‌ లెంగ్త్‌జీన్స్‌ బాగా నప్పుతాయి.
* సన్నగా ఉండి, కొంచెం ఎత్తు తక్కువగా ఉన్నవారు కాలర్‌ కాస్త పెద్దగా ఉన్న రకాలు వేసుకోకూడదు. సాదా టీషర్టు వేసుకుంటే చాలు. జతగా యాంకిల్‌ లెంగ్త్‌ జీన్స్‌, స్ట్రెయిట్‌ పాంట్స్‌ ఎంచుకోవచ్చు. శరీరమంతా సన్నగా ఉండి… నడుము భాగం పెద్దగా ఉన్నవారు లేయరింగ్‌ వైపు వెళ్లొచ్చు. మొదట సాదా టీషర్టు వేసుకొని, పైన పొడువాటి జాకెట్‌ వేసుకోవచ్చు. ఇది నడుముభాగాన్ని కప్పి ఉంచుతుంది.
* లావుగా ఉన్నవారు సాదా రకాలకు బదులు చిన్న చిన్న మోటిఫ్‌లు, ప్రింటున్న రకాలను ప్రయత్నించాలి. వీటిని ఎంచుకోవడం వల్ల శరీరాకృతి అంతగా తెలియదు. పైగా కొంచెం షార్ట్‌ కుర్తీలా వస్తాయి. వీటిమీదకు స్కిన్నీ జీన్స్‌, జెగ్గింగ్స్‌ కాకుండా… పొట్టపైవరకూ ఉండే స్ట్రెయిట్‌ జీన్స్‌ ప్రయత్నించాలి. లోపల ప్లెయిన్‌ టీషర్ట్స్‌ వేసుకునేవారు పైన ష్రగ్‌ లేదా హ్యాండ్లూమ్‌ జాకెట్‌… వంటివి ధరించొచ్చు. ఇప్పుడు మోచేతుల వరకూ ఉండే టీషర్టు రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫుల్‌లెంగ్త్‌, షార్ట్‌లెంగ్త్‌ స్కర్టులపైకి టీషర్టులు వేసుకోవడం వల్ల కాస్త బరువున్నా స్టైలిష్‌గా కనిపిస్తారు. నగలు ఎంత తక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. సందర్భాన్ని బట్టి హీల్స్‌ మొదలు స్నీకర్స్‌ వరకూ ఏవయినా వేసుకోవచ్చు.