DailyDose

మృతుల సంఖ్య 259 మాత్రమే-నేరవార్తలు-04/26

sri lanka blast death toll is 259 confirms srilankan government

Ø బ్యాంక్ కుంభకోణం కేసులో నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడికి నేడు లండన్ కోర్ట్ బెయిల్ నిరాకరించింది

Ø ఏపీలో వేసవిలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేటు పాటశాలలపై అధికారులు దాడులు జరుపుతున్నారు

Ø విజయవాడలో ఇసుక్రీం తయారుచేసే కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపి సాంపిల్స్ సేకరించి ప్రయోగాశాలలకు పంపారు. అపరిశుభ్రంగా ఉన్న కేంద్రాలను మూసివేయాలని నోటీసులు ఇచ్చారు

Ø కర్ణాటకలోని కార్వార్ వోడరేవులో ఒక నౌకలో జరిగిన అగ్నిప్రమాదంలో డి ఎస్ చౌహాన అనే నావల్ అధికారి మృతిచెందారు

Ø గుంటూరులో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేసారు

Ø మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ రైల్వే స్టేషన్ క్యాంటీన్ లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఆస్తినష్టం సంభవించింది

Ø ఇంగ్లాండ్ లోని టాటా స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు భారీగా పేలుళ్లు సంభవించాయి. ఆస్తినష్టం ఆంచనా వేస్తున్నారు

Ø రేపల్లెలో ఒక ప్రైవేటు స్కూల్ బస్సు బొల్తాపడి ఒక వ్యక్తీ మృతిచెందాడు మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి

Ø శ్రీలంకలో పేలుళ్ళలో మృతుల సంఖ్య 259 మాత్రమేనని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది

Ø రాజేందర్ నగర్ హైదర్ గూడాలో ఒక పార్క్ లో ఆడుకుంటున్న 6 ఏళ్ల బిశాన్ శర్మపై సిమెంట్ బెంచీ పడడంతో మృతిచెందాడు