Editorials

రెండు పడవలపై కాళ్లు

mukesh ambanis money is untangibly tied to his political connections

దేశంలోనే నంబర్ 1 ధనవంతుడు.. అపర కుబేరుడు.. అన్ని వేల కోట్లకు అధిపతి.. ముఖేష్ అంబానీ.. ఆయన అంత స్థాయికి ఊరికే ఎదగాడని అనుకుంటున్నారా? ఎంత తెలివితేటలు.. ఎంతటి సామర్థ్యంతో పాటు కాసింత రాజకీయం కూడా కలగలిసింది కాబట్టే అంత ఎత్తున ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో కాంగ్రెస్ గెలిచినా.. మోడీ గెలిచినా ముఖేష్ అంబానీ గెలిచినట్టే.. ఎందుకంటే ఆయన ఇరు పార్టీల పడవలపై చెరో కాలు వేసి పయనిస్తున్నాడు మరీ..సార్వత్రిక ఎన్నికల్లో బడా పారిశ్రామికవేత్తల మద్దతు కాంగ్రెస్ కా బీజేపీకా అన్న సందేహం కలుగడం సహజం. కానీ ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితుల్లో దేశంలో పారిశ్రామికవేత్లలందరూ అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి సమదూరం పాటిస్తున్నారు. ఇద్దరికీ విరాళాలిస్తూ ఇద్దరికీ మద్దతు తెలుపుతూ తాము అందిరివాళ్లం అంటున్నారు. తాజాగా ముఖేష్ అంబానీ నివాసం ఉంటున్న దక్షిణ ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మిలింద్ దేవరా పోటీచేస్తున్నారు. ఆయన ట్వీట్ చేసిన వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అదినేత ముఖేష్ అంబానీ.. కోటక్ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఉదయ్ కోటక్ లు తమ మద్దతును మిలింద్ కు ప్రకటించారు. వీళ్లతోపాటు ఎంతో మంది వ్యాపారులు పారిశ్రామికవేత్తలు మిలింద్ కు మద్దతు తెలియజేశారు. ఇలా ముఖేష్ అంబానీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేశాడని అనుకుంటే పొరపాటే. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబైలోని బాంద్రాకుర్లా కాంప్లెక్స్ లో సమావేశం నిర్వహించాడు. ఈ సభకు అంబానీ కుటుంబం నుంచి ముఖేష్ అంబానీల కొడుకు అనంత్ అంబానీ హాజరయ్యాడు. ఇలా తండ్రి కాంగ్రెస్ కు సపోర్ట్ గా నిలిస్తే.. కొడుకును బీజేపీకి మద్దతుగా నిలిపి ముఖేష్ అంబానీ తన బిజినెస్ చతురతను రాజకీయాల్లోనూ వాడేశారు. ఎంతైనా అంబానీలది మైండే మైండ్.