రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 190 సీట్లు పెంచేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో రాష్ర్టానికి ఈ అదనపు సీట్లు రానున్నాయి. 200 సీట్లు ఉన్న కాలేజీలు ఆరు, 150 సీట్లు ఉన్న కాలేజీలు మూడు, 100 సీట్లు ఉన్న కాలేజీలు మూడు రాష్ట్రంలో ఉన్నాయి. కొత్తగా రానున్న సీట్లను సర్దుబాటు చేసేందుకు కాలేజీల్లో ఉన్న వసతులు, విద్యార్థుల సంఖ్య, అవసరాలకు సంబంధించిన వివరాలు ఈ నెల 15లోగా పంపాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాలేజీలకు లేఖలు రాసింది. ఆయా కాలేజీల్లో ఉన్న సౌకర్యాలు, ఆ ప్రాంత అవసరాల ఆధారంగా పెంచిన సీట్లను కేటాయిస్తారు. ఈ విద్యాసంవత్సరం నుంచే పెంచిన 190 సీట్లను ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయిస్తారు.
ఏపీలో అదనంగా 190 వైద్య సీట్లకు ఆమోదం
Related tags :