Politics

మల్లన్నసాగర్‌ ఓ గుండెకాయ

Mallannasagar is crucial to Kaleshwaram project

మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన పునరావాసం కింద తక్షణ పరిహారం చెల్లించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పరిహారం ప్రక్రియ ఇప్పటికే చాలా వరకు పూర్తయిందన్న ముఖ్యమంత్రి మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సీఎస్‌ ఎస్కే జోషీని ఆదేశించారు. మల్లన్నసాగర్ జలాశయం పనుల్లో పురోగతి, భూనిర్వాసితులకు ఉపాధి, పునరావాసంపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 11లోపు పరిహారం, పునరావాసం నివేదికను హైకోర్టుకు సమర్పించాలని నిర్దేశించారు. పునరావాసం ప్రక్రియను సీఎస్‌ స్వయంగా పర్యవేక్షించాలన్నారు. అందుకోసం గ్రామాల వారీగా శిబిరాలను నిర్వహించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్‌ ఓ గుండెకాయ లాంటిదని సీఎం అభిప్రాయపడ్డారు. భూ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుభూతితో ఉందని, ఉపాధి, పునరావసం విషయంలో దేశానికే ఆదర్శంగా ఉండే ప్యాకేజీని ఇస్తామని భరోసా ఇచ్చారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు రూ.800 కోట్లతో పరిహారం, పునరావాస కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సీఎం వివరించారు.