Editorials

చంద్రబాబు సిఎం అయితే తానాలో అంతా తందానేగా-TNI ప్రత్యేకం

vemana satish tana history dc convention chandrababu clinton in america usa telugudesam tana

వచ్చే జూలై మొదటి వారంలో (4,5,6 తేదీల్లో) అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డిసీలో అధ్యక్షుడు వేమన సతీష్ ఆధ్వర్యంలో తానా 22వ మహాసభలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, పెద్ద ఎత్తున ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం జరుగుతోంది. ఈసారి జరిగే తానా మహాసభలు ఆంధ్ర రాష్ట్రంలో వెలువడే రాజకీయ ఫలితాలపై ఆధారపడి ఉంటాయి అనటంలో సందేహం లేదు. మే 23న వెలువడే ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు విజయం సాధిస్తే తానా మహాసభలు పెద్ద మహానాడు లాగా జరుగుతాయి. చంద్రబాబును ముఖ్యమంత్రి హోదాలో తానా సభలకు తీసుకువెళ్లాలని తానా నేతలు ప్రణాళికలు వేసుకుంటున్నారు. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ తరుపున గెలిసిన ఎమెల్యేలను మంత్రులుగా ఎంపికైన వారిని తానా సభలకు వారి బంధుమిత్ర సపరివారంగా అమెరకా తీసుకు వెళ్లాలని అధ్యక్షుడు వేమన సతీష్‌తో పాటు ఇతర కార్యావర్గ నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

*** 2007లో ప్రతిపక్ష నేతగా…
2007లో వాషింగ్టన్ డిసీలో నిర్వహించిన తానా మహాసభలు వైభవంగా జరిగాయి. తానా చరిత్రలో ఈ మహాసభలు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నిర్వహించారు. డా.బండ్ల హనుమయ్య తానా అధ్యక్షుడిగా, డా.ఎడ్ల హేమప్రసాద్ మహాసభల సమన్వయకర్తగా వ్యవహరించినప్పటికీ వేమన సతీష్ కీలక పాత్ర పోషించి 2007 తానా సభల దిగ్విజయానికి కృషి చేశారు. అప్పట్లో చంద్రబాబునాయుడు ఈ మహాసభలకు ప్రతిపక్ష నేతగా హాజరయ్యారు అయినప్పటికీ ఒక దేశాధినేతకు లభించే గౌరవాన్ని చంద్రబాబుకు వేమన బృందం అందించింది. ప్రతిష్ఠాత్మకైమ హిల్టన్ హోటల్‌లో ప్రెసిడెన్సియల్ సూట్‌ను చంద్రబాబుకు కేటాయించారు. దాదాపు నాలుగు రోజుల పాటు చంద్రబాబు బృందం హిల్టన్ హోటల్‌లో రాచమర్యాదలు పొందింది. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ పోస్ట్ తదితర దినపత్రికల విలేఖర్లు చంద్రబాబును ఇంటర్వ్యూలు చేసి ప్రపంచ దేశాలకు ఆయనను గురించి మరికొంతగా పరిచయం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ మహాసభలకు ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. చంద్రబాబును క్లింటన్ పక్కన నిలబెట్టి గౌరవించారు. చాలామంది ప్రముఖులు 2007 తానా మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

*** వేమన నాయకుడిగా ఎదిగింది ఇక్కడి నుండే…
వాషింగ్టన్ డీసీ తానా మహాసభలకు ముందు అమెరికాలో సామాన్యమైన ఐటీ ఉద్యోగం చేస్తూ తెలుగుదేశం అభిమానిగా ఉన్న వేమన సతీష్ ఈ మహాసభలను బాగా ఉపయోగించుకున్నారు. చంద్రబాబు డిసీ విమానాశ్రయంలో దిగిన వెంటనే దాదాపు 60 పసుపు రంగు హమ్మర్ జీపులతో, వందలాది ఇతర వాహనాలతో ర్యాలీగా చంద్రబాబును హిల్టన్ హోటల్‌కు తీసుకువచ్చారు. ఇక్కడి నుండే చంద్రబాబుతో సతీష్ సాన్నిహిత్యం పెరిగింది. అప్పుడు పడిన పునాది తానాలో తిరుగులేని నాయకుడిగా వేమన సతీష్ ఎదగడానికి కారణమయ్యింది. ఎమెల్యే కావాలనేది వేమన సతీష్ జీవితాశయం. వచ్చే తానా మహాసభలను చంద్రబాబు సాక్షిగా విజయవంతం చేసి తన భవిష్యత్తుకి గట్టి పునాది వేసుకోవాలనేది సతీష్ ఆశయం. మరి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో వస్తారా లేక గతంలో లాగానే ప్రతిపక్ష నేతగా తానాకు వస్తారా? అనే విషయం తేలాలంటే మే 23 వరకు వేచి చూడవలిసిందే. కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

TANA 2019 Washington DC News Galleries & Videos
TANA 2019 Washington DC News Galleries & Videos

tags: vemana satish, vemana satish, tana 2019, tana washington dc 2019, 22nd tana convention, 22nd tana conference washington dc, tana telugu association of north america 2019 news, galleries tana 2019, videos tana 2019 dc, tana 2019 news coverage, special stories on tana 2019 convention, tdp, telugudesam, tana 2019, tana telugu desam, vemana satish tana tdp, tana convention gallery, tana washington dc gallery 2019, tana 2019 events, tana 2019 schedule, tana 2019 history, history of washington dc telugu conventions