DailyDose

చాపోకు జీవిత ఖైదు విధించిన అమెరికా కోర్టు-నేరవార్తలు–07/18

El Chapo Sentenced To Life-Daily Crime News - July182019

*మెక్సికోకు చెందిన కరుడుగట్టిన కొకెయిన్‌ స్మగ్లర్‌ జోక్విన్‌ ఎల్‌ చాపో గుజ్‌మాన్‌ (62)కు బుధవారం అమెరికాలోని బ్రూక్లిన్‌ కోర్టు జీవితఖైదు విధించింది. సొరంగాలు తవ్వి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేయడం, హత్యలు చేయించడం, లంచాలు ఇవ్వడంలో సిద్ధహస్తుడిగా చాపో పేరుపొందాడు. మెక్సికోలో గ్యాంగుల ముఠా పహారాలో ఉండే అతడిని అమెరికా అధికారులు గట్టి బందోబస్తు మధ్య తీసుకొచ్చారు. మెక్సికో జైళ్ల నుంచి రెండు సార్లు తప్పించుకొని పారిపోయిన సంఘటనలు ఉండడంతో, అతడిని ఇక్కడ ఏకాంతంగా బంధించారు. గత 25 ఏళ్లుగా అతడు టన్నుల కొద్దీ కొకెయిన్‌ను అమెరికాకు అక్రమంగా తరలించినట్టు రుజువైంది.
* ఏసీబీ కస్టడీకి తహసీల్దార్‌ లావణ్య
ఏసీబీ ప్రత్యేక కోర్టు కేశంపేట తహసీల్దార్‌ లావణ్యను కస్టడీకి అనుమతించింది. ప్రత్యేక కోర్టు తహసీల్దార్‌ లావణ్యను రెండ్రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతించింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో అధికారులు లావణ్యను విచారించనున్నారు. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఏసీబీ అధికారులు లావణ్యను రేపు కస్టడీకి తీసుకోనున్నారు. వీఆర్‌వో ఇచ్చిన సమాచారం ఆధారంగా తహసీల్దార్‌ ఇంట్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఏకంగా రూ.93 లక్షల అక్రమ నగదును పట్టుకున్న విషయం తెలిసిందే.
* కామారెడ్డి జిల్లాలోని పిట్లంలో గల బంగారు నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణం వెనక వైపు గోడ పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. దుకాణంలోని 43.3 తులాల బంగారం, 45.2 కిలోల వెండి చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌ టీం, డాగ్‌ స్కాడ్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ అన్యోన్య తెలిపారు.
* బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు పిల్లలకు ఆశ చూపించి ఆభరణాలను దొంగలిస్తున్నారన్నారు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హ్యాక్‌ ఐ యాప్‌తో మహిళలకు భద్రత పెరిగిందని సీపీ తెలిపారు.
* అత్తాపూర్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 125 వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ఎక్స్‌ప్రెస్‌వే పై కూర్చొని కిందకు దూకే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు అతడి వద్దకు పరుగెత్తుకొచ్చి.. వెనుకకు లాగేశారు.
* రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనటంతో 15మందికి గాయాలైన ఘటన కన్నారెడ్డి గేట్‌ వద్ద బోధన్‌-హైదరాబాద్‌ రోడ్డుపై గురువారం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న బస్సు అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వెనుక ఉన్న బస్సు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.
* విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ.. ఇద్దరు గిరిజనులను హతమార్చడమే కాకుండా మరో గిరిజనుడిని తీవ్రంగా గాయపరిచారు.
* టి.నర్సాపురం మండలంలోని మెట్టగూడెంలో ఓ భర్తచేతిలో భార్య హతమైన ఘటన గురువారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జీవనజ్యోతి(23) ఆమె భర్త మణికంఠల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది.
* హైదరాబాద్‌ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ వద్ద కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడిని ఏర్గట్ల వైస్‌ ఎంపీపీ లావణ్య భర్త అశోక్‌గా గుర్తించారు. అదేవిధంగా ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ సాయినగర్‌ వద్ద అదుపుతప్పి రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
*తమిళనాడుకు చెందిన ఏడుగురు గంజాయి స్మగ్లర్లను రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో 46 లక్షల రూపాయల విలువ చేసే 460కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా పాడేరులో పండించిన గంజాయిని తమిళనాడు మీదుగా విదేశాలకు ఈ ముఠా తరలిస్తోంది. ఈ ముఠా వద్ద నుంచి ఇన్నోవా, మహేంద్రా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
*జ‌పాన్‌లోని క్యోటోలో ఉన్న యానిమేష‌న్ స్టూడియోపై దాడి జ‌రిగింది. ఆ దాడిలో 12 మంది మృతిచెందారు. మ‌రో 35 మంది గాయ‌ప‌డిన‌ట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెప్పారు. యానిమేష‌న్ స్టూడియో బిల్డింగ్‌లో భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించాయి. మూడు అంత‌స్తుల బిల్డింగ్ నుంచి తెల్ల‌టి పొగ చెల‌రేగింది. స్టూడియోలోని మొద‌టి అంత‌స్తులో పేలుడు జ‌రిగిన్న‌ట్లు సాక్షులు చెబుతున్నారు. ఓ వ్య‌క్తి గుర్తు తెలియ‌ని ద్ర‌వాన్ని బిల్డింగ్‌లో పార‌పోశాడ‌ని, దాంతో భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ అనుమానితున్ని అరెస్టు చేశారు.
*పాముకాటుతో వివాహిత మృతిచెందిన సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కోడూరు మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన కందుల సీతమ్మ(40) బుధవారం రాత్రి పాముకాటుకు గురై మృతిచెందింది. కాగా… సీతమ్మ మృతితో ఆమె కుటుంబంలో విషాధం అలుముకున్నాయి.
*ఆటో బోల్తా పడిన ఘటనలో 10 మంది మహిళా కూలీలకు గాయాలయ్యాయి. లిక్కర్ ప్యాక్టరీలో పనిచేయటానికి వెళుతున్న మహిళా కూలీలు 10 మందితో బయలు దేరిన ఆటో స్థానిక ఎఫ్‌సీఐ గోడౌన్స్ వద్దకు టైర్ పంక్చర్ అయింది. దీంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలోని 10 మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
*తమిళనాడులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌కు చెందిన కార్మికులతో ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు విల్లుపురం జిల్లా కల్లాకుర్చి వద్దకు చేరుకోగానే మరో ట్రక్కును ఢీకొంది. దీంతో కల్లకుర్చి-సేలం జాతీయ రహదారిపై మూడుగంటల పాటు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.
*ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ.. ఇద్దరు గిరిజనులను హతమార్చడమే కాకుండా మరో గిరిజనుడిని తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏజెన్సీలో చింతపల్లి మండలం వీరవరం గ్రామంలో గురువారం తెల్లవారుజామున మారణాయుధాలతో కొంతమంది మావోయిస్టులు ప్రవేశి దుశ్చర్యకు పాల్పడ్డారు.
*తమిళనాడులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌కు చెందిన కార్మికులతో ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు విల్లుపురం జిల్లా కల్లాకుర్చి వద్దకు చేరుకోగానే మరో ట్రక్కును ఢీకొంది. దీంతో కల్లకుర్చి-సేలం జాతీయ రహదారిపై మూడుగంటల పాటు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.
*అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన శరవణ భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌ మృతిచెందాడు. హత్యకేసులో కోర్టులో లొంగిపోయిన కొద్ది రోజులకే గుండెపోటుకు గురైన రాజగోపాల్‌ చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినట్లు పీటీఐ పేర్కొంది.
*తీవ్ర వర్షాభావ పరిస్థితులు అన్నదాతల ఉసురు తీసున్నాయి. పంట చేతికందక.. అప్పులు తీర్చే పరిస్థితి కానరాక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లాలోనే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితికి దర్పణం పడుతోంది.
*తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ హోంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కఠారి సత్యసాగర్రావు (70) బుధవారం రాత్రి హఠాన్మరణం చెందారు.
*తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ఆదిలాబాద్ జిల్లా చనాఖా-కొరాట బ్యారేజీవద్ద గుత్తేదారు నిర్లక్ష్యం ఇద్దరు కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంది. బుధవారం సాయంత్రం గేట్ల దగ్గర రబ్బర్లను అమర్చుతుండగా ఒక్కసారిగా హైడ్రా రోప్ తెగిపడిపోయింది.
* అంతర్జాల ఆధారిత వ్యాపారాలు నిర్వహిస్తున్న తమ సంస్థలో పెట్టుబడులు పెడితే 44 వారాల్లో రెట్టింపు లాభాలు వస్తాయంటూ ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న జస్ట్ డీల్ ట్రేడింగ్ కంపెనీ మదుపరులను మోసం చేసింది.
*నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తరలుతున్న బాల కార్మికులను ఖమ్మం రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ముస్కాన్ దళం, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా రక్షించారు.
*ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో ఆస్తి వివాదం రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బుధవారం ఉదయం స్థలం కోసం రెండు వర్గాలు ఘర్షణలకు దిగి పరస్పరం కాల్పులు జరిపాయి.
*నిజామాబాద్ జిల్లా జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య కేసులో వెంకటేశ్ అనే వ్యక్తికి ఇటీవల న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ రోజు వెంకటేశ్ కిటికీకి టవల్తో ఉరి వేసుకొని జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన ఖైదీది కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ గ్రామం. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు అధికారులు తెలిపారు.
*ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద ఆటోనగర్లో పార్కింగ్ చేసిన రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ రెండూ ఏసీ బస్సులు కావడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందని ఆగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
*ఓ న్యాయవిద్యార్థి మరో న్యాయవిద్యార్థిని కత్తితో మూడుచోట్ల పొడిచాడు. క్లాసురూములో తలెత్తిన వివాదం ఈ సంఘటనకు దారితీసింది. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
* పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేశారు. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేశారు. తమ సమాచారాన్ని పోలీసులకు ఆ ఇద్దరు గిరిజనులు చేరవేస్తున్నారని ఆగ్రహించిన మావోయిస్టులు దారుణంగా హతమార్చారు.
* భార్యను ఓ భర్త రాడ్డుతో కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా టీ.నర్సాపురం మండలం మెట్టగూడెంలో భార్య జీవన్జ్యోతి(23)ని రాడ్డుతో కొట్టి భర్త మణికంఠ చంపేశాడు. అనంతరం వెళ్లి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. భార్యను హత్య చేయడం వెనుక గల కారణాలపై విచారణ నిర్వహిస్తున్నారు.
* దేశ రాజధాని ఢిల్లీలోని బస్‌లో ఓ మహిళ డ్యాన్స్‌ చేస్తుండగా బస్‌ సిబ్బంది ఎంచక్కా ఎంజాయ్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో ఇటీవల వైరల్‌ అయింది. ఈ ఘటనకు సంబంధించి బస్‌ డ్రైవర్‌ను ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) సస్పెండ్‌ చేసింది. కండక్టర్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసి మార్షల్‌ను తిరిగి సివిల్‌ డిఫెన్స్‌ కార్యాలయానికి పంపింది.
* హఫిజ్‌ అరెస్టుపై అమెరికా పెదవి విరుపు-శిక్ష పడితేనే నమ్ముతాం
ముంబయి బాంబు దాడుల సూత్రధారి, జమాత్‌-ఉద్‌ దవా అధిపతి హఫిజ్‌ సయీద్‌ అరెస్టుపై అమెరికా స్పందించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తం చేసిన కాసేపటికే యూటర్న్‌ తీసుకుంది. రెండేళ్లుగా తాము ఒత్తిడి పెంచడం వల్లే అతణ్ని పాక్‌ అరెస్టు చేసిందని ట్రంప్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. పదేళ్ల గాలింపు తర్వాత ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి పాకిస్థాన్లో అరెస్టయ్యాడని, అతడిని అదుపులోకి తీసుకోవాలంటూ రెండేళ్లుగా పాక్‌పై బాగా ఒత్తిడి చేశామని ట్రంప్‌ పేర్కొన్నారు. తర్వాత కాసేపటికే అమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది. హఫిజ్‌ సయీద్‌ అరెస్టు విషయం నమ్మేలా లేదని యూఎస్‌ స్టాండింగ్‌ కమిటీ ఆరోపించింది. ట్రంప్‌ ట్వీట్‌ను కోట్‌ చేస్తూ ఈ విషయాన్ని ట్విటర్‌లో పేర్కొంది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ త్వరలో అమెరికా పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.‘పాకిస్థాన్‌ పదేళ్లనుంచి హఫిజ్‌ సయీద్‌ను వెతకడం లేదు. పాకిస్థాన్‌లో అతడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అతడిని అరెస్టు చేస్తున్నారు మళ్లీ విడిచిపెడుతున్నారు. 2001 డిసెంబరు, 2002 మే, 2002 అక్టోబరు, 2006 ఆగస్టు, 2008 డిసెంబరు, 2009 సెప్టెంబర్‌, జనవరి 2017లోనూ ఇదే జరిగింది. సయీద్‌కి శిక్ష పడే వరకు మన ప్రశంసలను మనతోనే ఉండనిద్దాం’ అని ట్వీట్‌ చేసింది.ట్రస్టుల ద్వారా సేకరించిన నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారని హఫిజ్‌ సహా మొత్తం 13 మంది అగ్రనేతలపై ఈ నెల 3న సీటీడీ కేసులు నమోదు చేసింది. వీరిలో కొందరు నిందితులు ఇప్పటికే న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. హఫిజ్‌ కూడా ఇదే ప్రయత్నంలో బుధవారం గుజ్రన్‌వాలా నుంచి లాహోర్‌కు పయనమయ్యాడు. మార్గ మధ్యంలోనే సీటీడీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు లాహోర్‌లోని అత్యంత కట్టుదిట్టమైన కోట్‌ లఖ్‌పత్‌ జైలుకు తరలించారు.
* విద్యార్థినులపై పెరుగుతున్న అకృత్యాలు..!
బ్రిటన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థినులపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. గత నాలుగేళ్ల కాలంలోనే పదింతలు పెరగడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 2014లో కేవలం 65 లైంగిక దాడులు చోటు చేసుకోగా అవి 2018లో 626కు చేరుకున్నాయి. బర్మింగ్‌హామ్‌ కేంబ్రిడ్జి యూనివర్శిటీ, ఈస్ట్‌ ఆంగ్లియా లెక్కల ప్రకారం ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు, లైంగిక దాడులు, వేధింపు సంఘటనలు చోటు చేసుకున్నాయని ‘ఛానల్‌ 4 న్యూస్‌’ దర్యాప్తులో తేలింది. వీటిలో ఎక్కువ సంఘటనలు కేసుల వరకు వెళ్లలేదు. కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారనే ఆందోళనతో చాలా సంఘటనలపై బాధితులైన విద్యార్థినులు ఫిర్యాదు చేయలేదు. కొందరు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా ముందుకు వెళితే వారిని యూనివర్శిటీల నుంచే అధికారులు తొలగించి వేశారట.ఆకతాయి అబ్బాయిలు చిత్తుగా తాగడం ఈ దారుణాలు పెరగడానికి ఓ కారణమైతే, తల్లిదండ్రులు పిల్లల్ని హద్దుల్లో ఉంచకపోవడం మరో కారణమని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తమపై జరిగిన లైంగిక దాడులు జరిగిన విషయాన్ని కొంత మంది విద్యార్థినులు బయటకు చెప్పుకోలేక పోతున్న నేపథ్యంలో కేంబ్రిడ్జ్‌లో అలాంటి సంఘటనల గురించి ఆకాశ రామన్నలు ఫిర్యాదు చేయడానికి ఆన్‌లైన్‌ ఫిర్యాదుల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. గత కొంతకాలంలో లైంగిక దాడులు మరీ పెరిగిన నేపథ్యంలో యూనివర్శిటీ అధికారులు ‘సెక్స్‌వెల్‌ అసాల్ట్‌ అడ్వైజరీ సెల్స్‌’ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగాలు మహిళలు తమకు జరిగిన అన్యాయాలను సక్రమంగా ఫిర్యాదు చేయడానికి తోడ్పడుతున్నాయి.60 శాతం మంది మహిళలు కళాశాలల నుంచి నేడు సురక్షితంగా ఇంటికి వెళ్లలేమని ఓ అధ్యయనంలో వెల్లడించారు. తమకు ఉద్దేశపూర్వకంగానే అనవసరంగా తాకుతున్నారని 35 శాతం మహిళలు వాపోతున్నారు.