ScienceAndTech

భారత నావికదళానికి ఇస్రో సరికొత్త ఉపగ్రహం

ISRO To Launch New Satellite For Indian Navy

నేవీ కోసం ఇస్రో శాటిలైట్‌‌‌‌‌‌‌‌. రూ.1,589 కోట్లకు డీల్.

మిలటరీ అవసరాల కోసం ఇండియన్ నేవీ.. ఇస్రో నుంచి ఓ శాటిలైట్ ను కొనుగోలు చేసింది. యుద్ధ నౌకల మధ్య కమ్యూనికేషన్ కోసం రూ.1,589 కోట్లతో డీల్ కుదు ర్చుకుంది. పోయిన నెల 11వ తేదీన ఈ ఒప్పందం కుదరినట్టు సమా చారం. ఓ ఏడాదిలో జీశాట్–7ఆర్ అనే ఉపగ్రహాన్ని, నేవీ కోసం ఇస్రో ప్రయోగించనుంది. తర్వాత సర్వీసులను నేవీకి అప్పగి స్తుంది. ప్రస్తుతం జీశాట్–7 అనే శాటిలైట్ నేవీ అవసరాలను తీరుస్తోంది. 2013లో దీన్ని ఇస్రో ప్రయోగిం చింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కోసం గతేడాది జీశాట్–7ఏ ను పంపింది. 2019లో రాడార్ సిగ్నల్స్, ఇంటెలి జెన్స్ అవసరాల కోసం ఎమిశాట్‌‌‌‌ను ప్రయోగిం చింది. జీశాట్–7 లైఫ్ టైమ్ పూర్తి కావొస్తున్న తరుణంలోనే నేవీ–ఇస్రో మధ్య కొత్త డీల్ కుదిరింది. రక్షణ రంగంలో ఇస్రో పాత్రను పెంచేం దుకు డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (డీఎస్ఆర్ఓ)ను క్రియేట్ చేయాలని కేంద్రం ఆదేశిం చింది. త్వరలో బెంగళూరులో దీన్ని ఏర్పాటు చేస్తారు