Agriculture

మాది రైతు పక్షపాత ప్రభుత్వం-నెల్లూరులో జగన్

Telugu Agricultural News Latest | YS Jagan Launches Rythu Bharosa In Nellore

‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకం ప్రారంభోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు:

ఇవాళ దాదాపు 40 లక్షల రైతుల కుటుంబాలకు ఇవాళ సహాయం అందుతోంది

మిగిలిన 14 లక్షల రైతుల కుటుంబాలకు కూడా ‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకంలో సహాయం అందుతుంది

అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతా అప్‌డేట్‌ చేస్తూ ప్రతి బుధవారం నాడు, రైతు భరోసా కింద సహాయం చేస్తాము

నవంబరు 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

కాబట్టి ఎవరైనా మిగిలిపోతే గ్రామ సచివాలయాలు, ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టరేట్‌ లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

మరో రెండు రోజుల్లో సంబంధిత వెబ్‌సైట్‌ లాంచ్ చేయబోతున్నాము

రేపు ప్రపంచ ఆహార దినం. అందుకే ఒకరోజు ముందు రైతు భరోసా పథకం ప్రారంభం.

కాసేపట్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.

రైతు బిడ్డగా నెల్లూరు వచ్చాను. ప్రతి రైతు చరిత్ర మార్చే గొప్ప పథకానికి ఇవాళ నాంది పలుకుతున్నాము.

2014 తర్వాత రాష్ట్రంలోని రైతులు చాలా నష్టపోయారు. ఆ పరిస్థితి మనమంతా చూశాం

2017, జూలై 8న మహానేత వైయస్సార్‌ జయంతి రోజు మంగళగిరిలో పార్టీ ప్లీనరీ జరిగింది. ఆరోజు రైతులకు ఒక మాట చెప్పాను.

5 ఎకరాల లోపు ఉన్న రైతులు, చిన్న, సన్నకారు రైతులకు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.50 వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తాము. ఏటా రూ.12,500 ఒకేసారి ఈ మొత్తం మే నెలలో ఇస్తాము. సాగు పెట్టుబడిగా ఆ సహాయం చేస్తాము. ఆ మొత్తం బ్యాంకులు రుణానికి జమ చేసుకోకుండా చర్యలు చేపడతాము. వైయస్సార్‌ భరోసా గా దాన్ని అమలు చేస్తాము’ అని చెప్పాను.

ఆ వాగ్ధానానికి మరింత మెరుగులు దిద్ది, రెండు పేజీల మేనిఫెస్టోలో తొలి వాగ్ధానంగా ప్రకటించాము.

మేనిఫెస్టోలో చెప్పిన దానికి మరింత మెరుగులు దిద్ది, సహాయం కూడా పెంచి ఈ పథకం అమలు చేస్తున్నాము.

అదే విధంగా 8 నెలల ముందుగానే అమలు చేస్తున్నాము

వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్‌ పంట వేసే సమయంలో మే నెలలో రూ.7500, అక్టోబరులో రబీ అవసరాలు తీరేలా రూ.4 వేలు, ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండగ వేళ మరో రూ.2 వేలు ఇవ్వబోతున్నాము.

గతంలో చెప్పినట్లు రూ.12,500 కంటే ఎక్కువ రూ.13,500 ఇవ్వబోతున్నాము.

ఆ సహాయం కూడా నాలుగేళ్లకు కాకుండా 5 ఏళ్లు ఇవ్వబోతున్నాము. ఆ విధంగా ప్రతి రైతు కుటుంబానికి రూ.67,500 ఇవ్వబోతున్నాము

గత ప్రభుత్వం సాధికార సర్వే ద్వారా 43 లక్షల రైతులను గుర్తించగా, ఈ ప్రభుత్వం పక్కా సర్వేతో 51 లక్షల రైతు కుటుంబాలను గుర్తించింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో భూమి లేని నిరుపేదలైన కౌలు రైతులు 3 లక్షల మందికి కూడా ఈ పథకంలో సహాయం చేస్తున్నాము

ఆ విధంగా మొత్తం 54 లక్షల రైతుల కుటుంబాలకు మేలు చేయబోతున్నాము

ఇప్పటికే గత జూన్‌లో రూ.2 వేలు మీకు సహాయంగా అందింది.

ఇప్పుడు బటన్‌ నొక్కగానే మీమీ ఖాతాల్లో రూ.9 వేలు జమ అవుతాయి

ఆ తర్వాత సంక్రాంతి పండగ సమయంలో మరో రూ.2 వేలు అందిస్తాము

చెప్పిన దాని కంటే ముందుగా, మాట ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఇస్తూ మీ బిడ్డగా అడుగు ముందుకేస్తున్నాను

అధికారం చేపట్టగానే ప్రతి హామీ అమలు చేస్తున్నాము. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పగలే సరఫరా చేస్తున్నాము

పంటల బీమా కోసం 55 లక్షల రైతుల తరపున 56 లక్షల హెక్టార్ల భూమికి సంబంధించి రూ.2164 కోట్లు ప్రీమియమ్‌గా చెల్లిస్తోంది.

కౌలు రైతులకు కూడా భరోసా ఇచ్చే విధంగా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే చట్టం చేశాం.

రూ.1.5 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులకు సున్నా వడ్డీ రుణం అమలు చేస్తున్నాం

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నాము

2019 ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 6.6 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశాము.

కరువులో రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేశాం

ధాన్య సేకరణలో గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయి పెడితే, ఆ మొత్తాన్ని తీర్చేశాం

ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా దాదాపు రూ.2 వేల కోట్లు ఉండగా, అది కూడా చెల్లించాము.

శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాలుకు రూ.1500 చొప్పున సహాయం చేశాం.

పామాయిల్‌ రైతులకు రూ.87 కోట్లు ఇచ్చి అండగా నిల్చాం

రైతులు బలవన్మరణానికి పాల్పడితే వారికి వెంటనే రూ.7 లక్షల సహాయం ఇస్తున్నాం. దాన్ని కలెక్టర్‌ స్వయంగా అందజేస్తున్నారు.

రూ.770 కోట్లతో ఆక్వా రైతులకు రూ.1.50 కే యూనిట్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నాము

ఆవులు, గేదెలు, మేకలు గొర్రెలు చనిపోతే బీమా పరిహారం ఇస్తున్నాం

వ్యవసాయ ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు చేశాం

గ్రామ సచివాలయం పక్కనే దుకాణం. అందులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతాము.

ఈ ఏడాదిలోనే ఇది జరగబోతుంది

ప్రతి నియోజకవర్గంలో మ్యాపింగ్‌ చేసి, మండల కేంద్రాలలో కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తాము

రెండు మూడు మండలాలను యూనిట్‌గా చేసుకుని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాము

ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాన్ని అవితీనిమయం చేసింది. అందుకే రివర్స్‌ టెండరింగ్‌ వి«ధానం తీసుకువచ్చా