Editorials

గోదావరి బోటులో బేతాళ నృత్యం..DNA పరీక్షలే దిక్కు…ప్రత్యేక కథనం

Godavari boat accident victims identification using DNA

పోలవరంలో బోటు ప్రమాద సంఘటన జరిగి 38రోజులైంది. ‘పోలవరం బోటు ప్రమాదం.. సెలబ్రిటి శవాలు కాదు’ అంటూ ఓ ప్రత్యేక కథనం గతనెల 27న ‘ఆదాబ్ హైదరాబాద్’ అందించింది. సామాన్య శవాలకు విలువ లేదనే కోణంలో వెలువరించిన మానవీకోణ కథనం అందర్నీ కన్నీరు పెట్టించింది. ప్రభుత్వాన్ని కదలించింది. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి బోటును వెలికితీయాలని ఆదేశించారు. లక్షలు ఇచ్చిన కాంట్రాక్టు పని చేతులెత్తేసి కొండెక్కేసింది. ‘సత్యం’ ఆ బోటును ఉచితంగా తీస్తానని నెత్తీ, నోరు కొట్టుకుంటుంటే… ‘నొసలు చిట్లిస్తూ అధికారులు తప్పక ఓకే’ అనేశారు. ఆయన రంగంలోకి దిగారు. పడవను గుర్తించారు. ఓ రెయిలింగ్ ను తెచ్చారు. అయితే ఆ బోటులో ఖచ్చితంగా శవాలు ఉన్నాయి. ఆ చచ్చిన శవాలు ఆనందంగా ఉన్నాయి. ఎందుకంటే తమ వాళ్ళు తమ శవాలను చివరి చూపులు చూస్తాయని. ఆ బోటులో శవాలున్నాయనే ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. అవి గుర్తు పట్టలేని స్థితికి కూడా చేరుకున్నాయి. ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న పరిశీలన కథనం.
**అందులో శవాలున్నాయ్:
బోటు మునిగిపోయి 38 రోజులవుతోంది. అందులో అసలు శవాలు ఉన్నాయా..? లేవా..? బోటు బయటకు వస్తే తెలియదని అధికారుల వాదన. అయితే కొంచెం ‘కామన్ సెన్స్’ ఉపయోగిస్తే… “బోటులో ఓపెన్ ఏరియాలో అంటే బోటు నడిపే ప్రాంతంలో… బోటు పైన ఎక్కి ప్రకృతి ఆస్వాధించే వారు అటు బతికి… ఇటు మరణించిన వారి లెక్కలు తేల్చారు. అయితే… బోటులో ఏసీ ఉండే విధంగా (మెదట ప్రయాణికులు ప్రవేశించే అద్దాల గది ప్రాంగణం)లో ఉండే వారి గురించి”.. ఒలోచిస్తే… ఆ గదిలో ఉండే వారు ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ బతికే అవకాశం లేదు. ఏసీ వేసి ఉండటంతో…తలుపులు బిగుతుగా ఉంటాయి. బోటు మునిగే సమయంలో.. ఆ గదిలో ఉన్న వారంతా… బయటకు వచ్చే అవకాశం లేదు. వీరి శవొలుగా మారారు. అందుకే బోటు తీసే ప్రయత్నంలో దుర్వాసన వస్తుంది. ప్రస్తుతం నీరంతా బురదమయంగా మారడం, విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో లోపలికి దిగేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది.
**ఇదీ జరిగింది..:
తూర్పుగోదావరి జిల్లా, దేవీపట్నం మండలం కచ్చులూరు కొండ (మందం) వద్ద రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు వెలికితీత పనులు ఆదివారానికి ఐదవ రోజుకు చేరుకున్నాయి. గత మంగళవారమే కాకినాడ నుంచి సత్యం బృందం వచ్చినా అధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో వారంతా దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉండిపోయారు.. బుధవారం కచ్చులూరు కొండ వద్ద దేవుడు గొందుకు ఎదురుగా గోదావరి నదిలో బోటు మునిగిన ప్రాంతాన్ని లంగర్ల సాయంతో గుర్తించారు. గురువారం కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ పర్యవేక్షణలో తాళ్ల (రోప్‌) సాయంతో లంగర్లు వేసినా బోటు ముందు భాగంలోని రెయిలింగ్‌ మాత్రమే ఊడొచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వెలికతీత పనులు ప్రారంభించారు. తొలుత బోటు మునిగిన ప్రదేశం చుట్టూ రోప్‌లు వేసిన అనంతరం లంగరు దించారు. ఈ క్రమంలో బోటు ఒక్కసారిగా కదలడంతో ఆ ప్రాంతంలో బుడగలతో పాటు డిస్పోజబుల్‌ గ్లాసుల కట్ట ఒకటి పైకి తేలింది. ఆ ప్రాంతంలో భరించలేని దుర్వాసన వస్తోందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. మధ్యాహ్నం నుంచి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టగా భారీ వర్షం రావడంతో వెలికితీత పనులను నిలిపివేశారు.
**ఏ స్థితిలో ఉంది:
ప్రస్తుతం బోటు ఒడ్డుకు 250 అడుగుల దూరంలో 40 అడుగుల లోతులో ఉన్నట్లు సత్యం తెలిపారు. సుమారు 50 అడుగులు ముందుకు వచ్చినట్లు అంచనా. బోటు 25 టన్నుల బరువు ఉండవచ్చు. ప్రమాదానికి గురైన ప్రాంతం నుంచి దిగువకు కొద్దిదూరం బోటు కొట్టుకురావడంతో బురద, ఇసుక భారీగా అందులోకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని స్థానిక మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. బరువు పెరగడం వల్లే లంగర్లు వేసి లాగుతున్న క్రమంలో బోటు కదులుతోందే తప్ర బయటకు రావడం లేదు.
**స్కూబాడైవర్లతో సంప్రదింపులు:
ధర్మాడి బృందం విశాఖలోని స్కూబాడైవర్లతో సంప్రదింపులు జరిపారు. వీళ్లు నది లోపలికి వెళ్లి బోటుకు తాళ్లు చుట్టగలరు. ధర్మాడి సత్యం బృందం కోరిక మేరకు బోటును వెలికితీసేందుకు స్కూబాడైవర్లు దేవీపట్నం చేరుకున్నారు.
అయితే అక్కడి నుంచి కచ్చులూరు వెళ్లేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో ధర్మాడి సత్యం వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు తొలుత నిరాకరించినా.. ధర్మాడి సత్యం పట్టుబట్టడంతో ఎట్టకేలకు స్కూబాడైవర్లను అనుమతించి, బోటును ఏర్పాటు చేశారు. దీంతో కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ అనుమతితో ప్రత్యేక బోటులో స్కూబా డైవర్ల బృందం కచ్చులూరు చేరుకుంది. ఓ చిన్న పిల్లవిడి శవం గుర్తపట్టని స్థితిలో లభ్యమైంది. మీడియాను అధికారులు అనుమతించటంలేదు.