DailyDose

అమరావతిలో తెదేపా నేతలు-రాజకీయ-11/06

TDP Leaders Visit Amaravati-Telugu Political News Roundup Today-11/06

* పది హైదరాబాదులోనే ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని అమరావతికి తీసుకొచ్చారు చంద్రబాబుఅన్ని జిల్లాలకు యాక్సిస్ ఉంటుందని అమరావతిని రాజధానిగా నిర్ధారించాంనదీపరీవాహక ప్రాంతంలో రాజధాని కడితే చాలా సుందరమైన సిటీ అవుతుందిచంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీతో ఫండ్స్ వచ్చాయికొత్త ప్రభుత్వం వచ్చాక రావలసిన నిధులు వెనక్కి పోయాయి, రాష్ట్రానికి అప్పు ఇస్తామన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారుహైదరాబాదు అభివృద్ధి చూస్తేనే ఎలా ఉంటుందో తెలుస్తుందిచంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను నమ్మి, 35వేల ఎకరాల భూమి ఇచ్చారురైతులందరూ ఇప్పుడు ఏమవ్వాలిఐఎఎస్ ల క్వార్టర్ల నిర్మాణం లక్ష యాభైవేల చదరపు గజాల నిర్మాణం పూర్తయిందిజగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణం విషయంలో అమరావతి పేరు అసలు పలకలేదుజగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర భవిష్యత్తు గురించి అమరావతి అవసరం అని తెలియదా…మాజీ మంత్రి అచ్చెం నాయుడు కామెంట్స్అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎంఎల్ఏ క్వార్టర్స్ ఒక నిదర్శనంబొత్స సత్యనారాయణ కారులో నేను కూడా వస్తాను, మొత్తం నిర్మాణాలు బొత్స సత్తిబాబుకు చూపిస్తాఎక్కడో రంగులేసుకోవడం కాదు, ఇక్కడ రంగులేస్తే చాలు ఉపయోగించుకోవచ్చుఅసెంబ్లీకి ఐదు నిముషాల దూరంలో ఉన్నాం, ఇక్కడే ఉందాం రంగులేయిస్తేఢిల్లీ వెళ్ళి టిడిపి పనులు చేసింది, డబ్బులిమ్మని జగన్ అడుక్కుంటున్నాడుఅమరావతిలో ఇటుక కూడా వేయలేదని సిగ్గుమాలిన మాటలు మాట్లాటుతున్నారు వైసిపి మంత్రులుపనులే జరగలేదనటానికి బొత్స సత్తిబాబుది నోరా తాటిమట్టారాజధాని నిర్మాణాలు జరుగుతున్నాయని నిరూపిస్తున్నాం.
* అమిత్‌ షా మౌనం వెనక మర్మమేమిటి?
‘శాంతి భద్రతల పరిస్థితి దెబ్బ తిన్నది’ అన్న వ్యాఖ్య మన దేశంలో ఎప్పుడూ ఏదో చోటు నుంచి వినిపిస్తూనే ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణ పేరిట రాష్ట్ర ప్రభుత్వాలను తప్పించి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడం గురించి కూడా మనం వింటుంటాం. శాంతి భద్రతల పరిరక్షణకు పాటు పడాల్సిన రెండు ముఖ్య విభాగాలైన పోలీసులు, న్యాయవాదులే వాటిని భగ్నం చేయడాన్ని ఏమనాలి? గత కొన్ని రోజులుగా ఢిల్లీ నగరంలో కొనసాగుతున్న పరిస్థితి ఇదే. ఇరు వర్గాలు పరస్పర వ్యతిరేకంగా వీధుల్లోకి కూడా వచ్చాయి.
* జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ రాజధానిని పులివెందులో పెట్టుకుంటారేమో అని ఎద్దేవా చేశారు. రాజధాని పులివెందులో..కోర్టు కర్నూలులో పెట్టుకుంటే ఆయనకు ఖర్చులు కూడా కలుసొస్తాయని ఎద్దేవా చేశారు. అదే మంత్రి బొత్స సత్యనారాయణని అడిగితే రాజధాని చీపురుపల్లిలో పెడదామని అంటారని వ్యంగాస్త్రాలు సంధించారు. విశాఖపట్నంలో జనసైనికుల సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ పతాకాన్ని గౌరవించలేని వ్యక్తికి జాతికి సేవ చేసిన వారి విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి నాకేం తెలియదు అంటూ మాట మార్చారన్నారు. దేశానికి మిసైల్ పరిజ్ఞానం ఇచ్చిన మహనీయులు కలామ్. ఆయన పేరిట ఉన్న పురస్కారానికి ముఖ్యమంత్రి తన తండ్రి వైఎస్ఆర్ పేరు ఎలా పెడతారు.
* పారిస్ ఒప్పందం నుంచి అమెరికా ఔట్
భూతాపం నివారణకు 2015లో 188 దేశాలు సంతకం చేసిన పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగే ప్రక్రియను అమెరికా ప్రారంభించింది. ఈ మేరకు సోమవారం అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి నోటీసు అందజేశారు. 2020 నవంబర్ నాలుగో తేదీన ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై విపక్ష డెమొక్రటిక్ పార్టీ మండిపడింది. అమెరికా ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పందిస్తూ పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్లక్ష్య పూరిత నిర్ణయంతో మూల్యం చెల్లించాల్సింది మన వారసులేనన్నారు. 2015లో కాప్21 పేరిట పారిస్ ఒప్పందం ఖరారులో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించగా ఈ ఒప్పందం నుంచి వైదొలుగనున్నట్లు 2017 జూన్ 1న ట్రంప్ ప్రకటించారు.
*జగన్‌ మూల్యం చెల్లించక తప్పదు:యనమల
ముఖ్యమంత్రి జగన్ సంతకం లేకుండానే పురస్కారం పేరు మారుస్తూ జీవో 301 విడుదల చేశారా? అని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. సీఎం చెప్పకుండానే మంత్రి జీవోపై సంతకం పెట్టారా? అని ప్రశ్నించారు. అబ్దుల్ కలాం ప్రతిభ అవార్డుల పేరు మార్చేసి వైఎస్సార్ పేరు పెట్టాలను కోవడాన్ని ఆయన తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. జీవోకు, మెమోకు చాలా తేడా ఉంటుందని, సంబంధిత శాఖకార్యదర్శి, మంత్రి సంతకం లేకుండా జీవో విడుదల కాదని ఆయన అన్నారు. జీవోపై సంతకం పెట్టిన మంత్రి ఎవరని ప్రశ్నించారు. ఈ జీవోపై ముఖ్యమంత్రి సంతకం కూడా ఉంటుందని చెప్పారు. జీవో 301 సమగ్ర వివరాలన్నీ ప్రజలకు వెల్లడించాలని, కలాం పేరు మార్పు జీవోపై నిజానిజాలను సీఎం జగన్ బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
*హామీల అమలులో ఎన్డీయే వైఫల్యం
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, అభివృద్ధి నిరోధక సర్కారుగా తయారైందని రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఉద్యోగాల కల్పన, భేటీ పఢావో- భేటీ బచావో అమలు, నల్లధనం వెలికి తీయడంలో మోదీ సర్కారు ఘెరంగా విఫలమైందన్నారు. భాజపా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నవంబరు 5 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటించిందన్నారు.
*ఆర్ఎస్ఎస్ అధినేతతో ఫడణవీస్ భేటీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ మంగళవారం సాయంత్రం నాగ్పుర్లో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్తో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
*ఎల్జేపీ అధ్యక్షుడిగా చిరాగ్ పాస్వాన్ ఎన్నిక
లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడిగా చిరాగ్ పాస్వాన్ మంగళవారం ఎన్నికయ్యారు. పార్టీ జాతీయ కార్యవర్గం చిరాగ్ను నూతన సారథిగా ఎన్నుకున్నట్లు ఆయన తండ్రి, కేంద్రమంత్రి రామ్ విలాస్పాస్వాన్ వెల్లడించారు.
*యడియూరప్ప’ ఆడియోను విచారణాంశంగా పరిగణిస్తాం
కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంలో ముఖ్యమంత్రి యడియూరప్ప మాట్లాడినట్లు వైరల్ అవుతున్న ఆడియోను విచారణాంశంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. కాంగ్రెస్, జనతాదళ్కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల రాజీనామాపై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. భాజపాకు అనుకూలంగానే వారంతా రాజీనామా చేశారనే అర్థం ధ్వనించేలా సీఎం మాట్లాడినట్లున్న ఆడియోను కాంగ్రెస్ న్యాయవాది కపిల్సిబల్ కోర్టుకు సమర్పించగా దానిని పరిగణనలోనికి తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం నిర్ణయించింది.
*చిక్కులు వీడని ముడి!
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి స్పష్టత రాలేదు. భాజపా-శివసేనల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసా..గుతూనే ఉంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో ఏ క్షణానైనా ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని భాజపా ప్రకటించింది. చెరిసగం పాలన, సీఎం పదవి కోసం డిమాండ్ చేస్తున్న శివసేన భాజపాపై విమర్శలను కొనసాగిస్తూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో ఈ రెండు పార్టీలు విఫలమైతే ‘ప్రత్యామ్నాయం’ గురించి ఆలోచిస్తామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చెబుతోంది.
*జగన్ పాలన గాడి తప్పుతోంది: వేదవ్యాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలన గాడి తప్పుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుండి తప్పుటడుగులు వేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఉపయోగ పడే అనేక విషయాల్లో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితి మరీ అద్వానంగా ఉందన్నారు.
*మంత్రి బొత్స ఓ జోకర్‌లా మాట్లాడుతున్నారు: అచ్చెన్నాయుడు
రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో ఒక్క ఇటుక లేదంటూ మంత్రి బొత్స ఒక జోకర్‌గా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతిలో నిర్మాణాలు లేవంటూ మంత్రి బొత్స చేసిన కామెంట్ల నేపథ్యంలో అచ్చెన్నాయుడు, నారాయణ నేతృత్వంలో టీడీపీ బృందం అక్కడ పర్యటించింది. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడ్డారు. అమరావతిలో శాసన సభ్యులకు 280 ప్లాట్లు సిద్ధం అయ్యాయని వివరించారు.
*కేసీఆర్‌ మనిషి రూపంలో ఉండే రాక్షసుడు: కోమటిరెడ్డి
కేసీఆర్‌ వచ్చాక తెలంగాణ అప్పు రూ.2లక్షల కోట్లకు చేరిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సీఎం డెడ్‌లైన్‌కు కనీసం 300 మంది స్పందించలేదన్నారు. ఈ నెల 9న చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేస్తామన్నారు. కేసీఆర్‌ మనిషి రూపంలో ఉండే రాక్షసుడని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇంతమంది కార్మికులు చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదన్నారు. కేసీఆర్‌ సర్కార్‌పై కసిగా పోరాడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తామన్నారు. పీసీసీ ఇచ్చినా… ఇవ్వకున్నా కాంగ్రెస్‌ కోసమే పని చేస్తానని కోమటిరెడ్డి తెలిపారు.
*ఈనెల 9న మిలియన్‌ మార్చ్‌: అశ్వత్థామరెడ్డి
ఈనెల 9న మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిలియన్‌ మార్చ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సంపూర్ణ మద్దతిచ్చారని అన్నారు. అలాగే మిలియన్‌ మార్చ్‌కు ఉద్యోగ సంఘాల మద్దతు కోరతామని అన్నారు. సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌కు ఒక్క కార్మికుడూ స్పందించలేదన్నారు. మంత్రుల వాహనాల్లో తీసుకెళ్లి విధుల్లో చేర్పించినా…కార్మికులు మళ్లీ వెనక్కి వస్తున్నారని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.
*తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడా : ఎర్రబెల్లి
నారన్నా.. ఆర్టీసీ కార్మికులందరినీ డ్యూటీలో జాయిన్ చేయించు.. ఇయ్యాల(మంగళవారం) లాస్ట్ డేటు.. ఇట్లనే జిజ్జుకు పోతే ఇబ్బంది పడుతరు.. కేసీఆర్ దగ్గరకి పోయి అడిగితే ఏదీ కాదనడు.. ఒక్క విలీనం అంశం తప్ప మిగిలిన కోరికల కోసం మీతో పాటు అందరం సీఎంతో మాట్లాడుదాం.. యూనియన్ లీడర్లుగా కాంగ్రెస్, బీజేపోళ్ల మాయలబడి ఇబ్బంది పడుతున్నరు.. మీరైన జాయిన్ కమ్మని పిలుపు నియ్యండ్రి.. అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను ఉద్దేశించి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.