‘‘చిన్నదో పెద్దదో అవకాశమంటూ రావడం ముఖ్యం. దాన్ని గౌరవించాల్సిందే’’ అంటోంది పూజా హెగ్డే. ‘ముకుంద’తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన పూజ… అనతి కాలంలోనే అగ్ర కథానాయకులతో జోడీ కట్టే అవకాశాల్ని అందిపుచ్చుకుంది. ప్రస్తుతం ప్రభాస్‌తో కలసి ఓ చిత్రంలో నటిస్తోంది. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోనూ తనే నాయిక. సంక్రాంతికి ఈ చిత్రం విడుదలకానుంది. ‘మీ బలాలేంటి?’ అని పూజాని అడిగితే… ‘‘వచ్చిన ప్రతి అవకాశాన్నీ గౌరవిస్తా. ఎందుకంటే ఈరోజుల్లో అవకాశాలు రావడమే గగనం అయిపోయింది. మనకంటే ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు. ‘ఒక్క ఛాన్స్’ అంటూ ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అలాంటి వాళ్లందరినీ దాటుకుని నాకో ఛాన్స్ వచ్చిందంటే అది నా అదృష్టమే. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. సినిమా అనే కాదు.. ప్రతి రంగంలోనూ అవకాశాలు కీలకం. మనం ఎదగాలంటే ఏదో ఓ చిన్న దారి కనిపించాలి. ఆ దారిలో వెళ్తే విజయాన్ని అందుకోవచ్చు. లేదంటే ఓ కొత్త పాఠమైనా నేర్చుకోవచ్చు. ఏదోలా మన ప్రయాణమైతే ప్రారంభించాలి. ఉన్నచోటే ఆగిపోతే అర్థం లేదు’’ అంది.
చిన్నా పెద్దా అంటు ఏమీ లేదు
Related tags :