Politics

జనవరి 22న తెలంగాణా మున్సిపల్ పోరు

Telangana Municipal Elections On January 22nd

తెలంగాణలో పురపాలక ఎన్నికల నగరా మోగింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 22న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. జనవరి 7న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జనవరి 8న రిటర్నింగ్‌ అధికారులు ఆయా ప్రాంతాల్లో ఎలక్షన్‌ నోటీస్‌ ఇస్తారు. జనవరి 10న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలించనున్నారు. 14వ తేదీని ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. జనవరి 22న పోలింగ్‌ నిర్వహించి 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రీపోలింగ్‌ చేపట్టాల్సి వస్తే 24న నిర్వహిస్తారు. ఎన్నికల షెడ్యూల్‌కు కాసేపటి ముందే ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది.