ScienceAndTech

NRIలకు తెలుగు ఆలయాల్లో ఆన్‌లైన్ పూజలు

Now NRIs Can Pay For Pujas Online-Telugu SciTech News

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆర్జితసేవలు, పూజలు చేయించుకోడానికి ప్రవాస భారతీయులు ఆన్‌లైన్‌లో చందాలు పంపేందుకు వీలు కల్పిస్తూ రెవెన్యూ (దేవాదాయ) కార్యదర్శి సోమవారం ఉత్తర్వులిచ్చారు. సింహాచలం, విశాఖ కనకమహాలక్ష్మి, అన్నవరం, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి, కంచికచర్ల తిరుపతమ్మ, శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం, కసాపురం ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు, ఆర్జితసేవలకు ఎన్ఆర్ఐల నుంచి చందాలు పొందేందుకు వీలుగా విదేశీ నిధుల క్రమబద్ధీకరణ (ఎఫ్‌సీఆర్‌) చట్టం కింద రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు దేవాదాయశాఖకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.