Agriculture

రైతుల కోసం రంగంలోకి దిగిన భువనేశ్వరి

Nara Bhuvaneswari Gifts Her Bangles To Amaravathi Farmers

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతుల నిరసన దీక్షలు 15వ రోజు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఎర్రబాలెం గ్రామంలో రైతుల దీక్షలో కూర్చుని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భువనేశ్వరి తన చేతికి ఉన్న గాజులు తీసి అమరావతి ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. భువనేశ్వరి మాట్లాడుతూ… ‘‘మహిళలు పడుతున్న బాధను తోటి మహిళగా అర్థం చేసుకున్నా. ఏపీని ప్రథమ స్థానంలోకి తీసుకురావడానికి చంద్రబాబు నిరంతర కృషి చేశారు. ప్రజల తర్వాతే.. నన్ను, కుటుంబాన్ని పట్టించుకునేవారు. ఎప్పుడూ అమరావతి, పోలవరం అని చంద్రబాబు తపించారు. ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే కష్టపడ్డారు. రైతులకు పూర్తి మద్దతుగా మా కుటుంబం అండగా ఉంటుంది. అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరు’’ అని తెలిపారు.