NRI-NRT

ఘనంగా టాంటెక్స్ 153వ సాహిత్య సదస్సు

TANTEX 153rd Nela Nela Telugu Vennela

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమర్పించిన నెల నెలా తెలుగు వెన్నెల 153 వ సాహిత్య సదస్సు ఏప్రిల్ మూడవ ఆదివారం ఆన్ లైన్లో డాలస్ మహానగరంలో ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 153 నెలల పాటున ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులులు నిర్వహించడం ఈ సంస్థ యొక్క విశేషం. కరోనా కబళించినా 153 వ సాహిత్య సదస్సుని ఘనంగా ఆన్ లైన్లో నిర్వహించిన ఘనత ఉత్తర టెక్సస్ తెలుగు సంఘానికే దక్కుతుంది. ముందుగా చిన్నారులు సాహితీ, సిందూర వేముల పాడిన ప్రార్థనా గీతంతో సభ ప్రారంభం అయింది.ఆ తర్వాత సాహిత్య సదస్సు సమన్వయకర్త మల్లిక్ కొండా సభకి ప్రసంగీకులని పరిచయం చేసారు. శ్రీయుతులు డా॥ సత్యం ఉపద్రష్ట తన ప్రసంగంలో పెద్దన, తెనాలి రామలింగ కవులు ఆశువు గా చెప్పిన పద్యాలలో ప్రయోగించబడిన అలంకారిక, ఔచిత్య లక్షణాలను సోదాహరణంగా, ఆసక్తి గా వివరించారు.డా. ఊర్మిండి నరసిమ్హా రెడ్డి తెలుగు సిరి సంపదల పేరుతో తెలుగు జాతీయాలని సభికులతో పంచుకున్నారు. గొప్ప భాషా శాస్తవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలుగు భాషకు మధ్య ద్రావిడ భాషా కుటుంబాలకూ చేసిన మహోన్నత సేవను లెనిన్ బాబు వేముల కొనియాడారు. మహాభారత ఇతిహాసాన్ని విరచించిన వ్యాస మహాముని పై స్వీయ కవితల గానం చేశారు డా॥ బల్లూరి ఉమాదేవి. సకల మానవాళిని తీవ్రంగా పీడిస్తున్న కరోనా వైరస్ పై అయినంపూడి శ్రీ లక్ష్మి గారి “కరోనాకి ఓ రిటర్న్ గిఫ్టు” కవితను చదివి వివరించారు అనంత్ మల్లవరపు.చివరిగా ఈ సదస్సు కు ముఖ్య అతిథి గా విచ్చేసిన ప్రముఖ స్వర కర్త, గాయకులు శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ “తెలుగు కావ్యానికి స్వరాభిషేకం” అనే శీర్షక క్రింద తమ అద్భుత పద్య గానంతో సభను రంజింపజేశారు. పద్యంలోని భావాన్ని స్వరమధురంగా శ్రోతలకు అందజేయడమే ఆశయంగా నడుస్తున్న వీరు భావానికి సరిపడే రాగాలను, స్వర రచనా ప్రణాళిక ను ఎలా ఎంచుకొన్నదీ సోదాహరణంగా వివరించారు. సంగీత దర్శకులు సాలూరు రాజేస్వర రావు గారితో తనకున్న సాన్నిహిథ్యం గురుంచి కూడా వీరు సభికులతో పంచుకున్నారు. శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారు ఆలపించిన పలు కావ్యాలలోని పద్యాలు ఉచితంగా సాంఘిక మాధ్యమాలలో లభ్యం కావించండం పద్యాన్ని బ్రతికించడమనే ఉద్యమానికి వారు చేస్తున్న ఆదర్శవంతమైన సేవ గా సభికులు కొనియాడారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు గారు ముఖ్య అతిథి శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారికి మరియు సదస్సు కి హాజరైన సాహిత్య ప్రియులకు ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు .