ఖైదీకి జోడీగా మారనున్నారట కత్రినా కైఫ్. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన చిత్రం ‘ఖైదీ’. కార్తీ నటించిన ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించనున్నారు. హీరోయిన్ గా కత్రినా కైఫ్ నటిస్తారని తాజా సమాచారం. ఒరిజినల్ లో హీరోయిన్ పాత్ర లేదు. హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ అందులోనూ హీరోయిన్ ని చూపించలేదు. అయితే ఈ రీమేక్ లో హీరోయిన్ పాత్రను యాడ్ చేయనున్నారట. అజయ్ భార్యగా కత్రినా నటించనున్నారట. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఖరారు కాలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు.
ఖైదీ కత్రినా
![ఖైదీ కత్రినా ఖైదీ కత్రినా](https://akm-img-a-in.tosshub.com/indiatoday/images/story/201810/2.jpeg?zTjMqMEiAaTZTEy.hG8doz1_C0QUoP3l)
Related tags :