Politics

కోనేరుకు కరోనా

కోనేరుకు కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసుల సంఖ్య భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 1.11 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే మూడువేలకు పైగా కేసులు నమోదుకావడం విశేషం. సామాన్యులు, రాజకీయనాయకులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. సిర్పూర్ కాగజ్ నగర్ తెరాస ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఆయనతో పాటుగా అయన భార్యకు కూడా కరోనా సోకింది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ర్యాపిడ్ టెస్టులు చేయించుకున్నారని, ఈ టెస్టులో పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని అధికారులు పేర్కొన్నారు.