WorldWonders

అమ్మా…నీ శక్తికి సలాం…16వ బిడ్డ అంట!

నీ శక్తికి సలాం…16వ బిడ్డ అంట!

దేవుడిచ్చిన వ‌రం కాద‌న‌డం త‌ప్పే.. అలా అని బ‌తికినంత కాలం పిల్ల‌ల్ని కంటూనే ఉంటే భూమాత మోయ‌గ‌ల‌దా. పాపులేష‌న్ పెరిగిపోయి ఒక‌రినొక‌రిని కొట్టుకొని చావ‌రు. అస‌లు వీరంతా ఉండ‌డానికి భూమి మీద ప్ర‌దేశం చాలాక అంత‌రిక్షంలో మ‌కాం పెట్టాల్సిందే. మ‌న పూర్వీకులు చేసిన త‌ప్పును చ‌దువుకున్న వారు లోకజ్ఞానం తెలిసిన వాళ్లు కూడా చేస్తే తేడా ఏముంటుంది. అమెరికాలోని నార్త్ క‌రోలినాలోని షార్లెట్‌కు చెందిన కార్లోస్‌ హెర్నాండెజ్, ప్యాటీ హెర్నాండెజ్ దంప‌తుల‌కు ఇప్ప‌టికే 15 మంది పిల్ల‌లున్నారు. ప్యాటీ ఇప్ప‌టికే మూడుసార్లు క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. వీరంద‌రినీ చూసుకుంటూనే మ‌రోసారి గ‌ర్బం దాల్చింది. అయితే 16వ బిడ్డ‌ను కూడా కంటావా అని అడిగితే దేవుడు ఇచ్చిన వ‌రాన్ని వ‌దులుకోకూడ‌దు. భ‌గ‌వంతుడు ఏది ఇస్తే అది తీసుకుంటామ‌ని చెబుతుంది ప్యాటీ. ఇండియాలో ఇద్ద‌రు, ముగ్గురు పిల్ల‌ల్నే పెంచ‌లేక చెత్త‌కుండీల్లో ప‌డేస్తున్నాయి. మ‌రి వీరు ఇంత‌మందిని ఎలా పెంచుతారో. ఈ దంప‌తుల‌కు స‌లాం కొట్టాల్సిందే.