NRI-NRT

గర్భిణులకు HIV బాధిత బాలల సేవకు తానా బృహత్తర పథకం-“అన్నపూర్ణ”

గర్భిణులకు HIV బాధిత బాలల సేవకు తానా బృహత్తర పథకం-“అన్నపూర్ణ”

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరికొత్త పథకానికి రూపకల్పన చేశారు. తానా అన్నపూర్ణ పేరిట నిర్వహించే ఈ పథకం ద్వారా ప్రారంభ దశలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సకు జేరిన గర్భిణులకు, HIV బాధిత బాలలకు భోజన సదుపాయాన్ని కల్పించనున్నారు. $200 డాలర్ల విరాళంతో 300మందికి ఈ సదుపాయాన్ని కల్పించేలా ప్రణాళిక రూపొందించినట్లు తానా కోశాధికారి కొల్లా అశోక్‌బాబు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.tana.org/projects/annapurna చూడవల్సిందిగా ఆయన సూచించారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ పుట్టగుంట సురేష్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.
గర్భిణులకు HIV బాధిత బాలల సేవకు తానా బృహత్తర పథకం-అన్నపూర్ణ - TANA Annapurna Scheme To Feed Pregnant Ladies And HIV Kids