తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలొ శనివారం నాడు దీపావళి వేడుకలు టొరంటో నగరంలోని టొరంటో పెవిలియన్ ఆడిటోరియంలో వైభ్వంగా నిర్వహించారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసల స్వాగతోపన్యాసం చేయగా, కల్పన మోటూరి, వాణి జయంతి, పద్మలత గుంటూరి, రజని లయం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. భారత మరియు కెనడా జాతీయ గీతాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కూచిపూడి, భరతనాట్యం , కథాకళి , జానపద, సినిమా గీతాలు, నృత్యాలు, నాటికలు వంటి ప్రదర్శనలు అలరించాయి. తాకా ఫౌండర్స్ చైర్మన్ చారి సామంతపూడి నూతన కార్యవర్గంచే ప్రమాణస్వీకారం చేయించారు. అధ్యక్షురాలు కల్పనా మోటూరి తమ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభికులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తాకా వ్యవస్థాపక సభ్యుడు అరుణ్ కుమార్ లయం, డైరెక్టర్ అనిత సజ్జ, తాకా మాజీ అధ్యక్షుడు శ్రీనాథ్ కుందూరు, వెలివోలు బసవయ్య, ట్రస్టీస్ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, ఫౌండర్స్ చైర్మన్ రవి వారణాసి, డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, గణేష్ తెరల, కోశాధికారి సురేష్ కూన, కార్యదర్శి నాగేంద్ర హంసాల, ట్రస్ట్ చైర్మన్ బాషా షేక్, సభ్యులు రామచంద్రరావు, దుగ్గిన, రాఘవ్ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లి, లోకేష్ చిల్లకూరు , రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి తదితరులు పాల్గొన్నారు.
New Governing Board (2021-2023)
Executive Committee:
అధ్యక్షురాలు: కల్పన మోటూరి
ఉపాధ్యక్షులు: నాగేంద్ర హంసాల
జనరల్ సెక్రటరీ: ప్రసన్న తిరుచిరాపల్లి
కోశాధికారి: మల్లికార్జునచారి పదిర
కల్చరల్ సెక్రటరీ: రాజా పుల్లంశెట్టి
డైరెక్టర్: రాణి మద్దెల
డైరెక్టర్: అనిత సజ్జ
డైరెక్టర్: గణేష్ తెరల
Board of Trustees:
ఛైర్మన్ : మునాఫ్ అబ్దుల్
ట్రస్టీ సబ్యులు : రాఘవ కుమార్ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక
Founders ఛైర్మన్: రవి వారణాసి