Devotional

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

* ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మాజీ మంత్రి మాగంటి బాబు సెటైర్లు వేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఆయన ఏ మాత్రం తప్పు మాట్లాడలేదు.. ఒక్కసారి మాత్రమే ఓటు వెయ్యమన్నారు.. ఇక ఆయనకు ఎవరు ఓటు వెయ్యక్కర్లేదు..’ అంటూ సెటైర్లు వేశారు. ఒక్కసారి సీఎం అయినందుకే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. చాలా మంది స్వార్థ పరులైన టీడీపీ నేతలు కాంట్రాక్టుల కోసం, ఇతర ప్రయోజనాల కోసం వేరే పార్టీలోకి వెళ్లిపోయారని, ముఖ్యంగా గన్నవరం, నూజీవీడు నాయకుల గురించి మాట్లాడుతున్నానన్నారు.* సీఎం జగన్ (Jagan) పై టీడీపీ నేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రైతు వ్యతిరేకి, రైతు ద్రోహి సీఎం జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ, విధ్వంసం, అరాచకాలు అమలు చేయడానికి తాడేపల్లి ప్యాలెస్ బిజీగా ఉంటుందన్నారు. తాడేపల్లి రాజప్రసాదానికి ముడుపులు చెల్లిస్తేనే ఆక్వా రంగానికి చెందిన ప్లాంట్లు, హేచరీలు నడుస్తాయన్నారు. ఆక్వా రైతులకు మద్దతు ధర అమలు చేయడం లేదన్నారు.

* జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులను సంక్షోభంలోకి నెట్టిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అధికారంలో లేనప్పుడే జగన్ లక్ష కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు సీఎం ను చేసి భస్మాసుర హస్తాన్ని నెత్తిమీద పెట్టుకున్నామన్నారు. జగన్ తప్పుడు నిర్ణయాల వల్లే అప్పుల్లో దేశంలోనే ఏపీది రెండో స్థానంలో ఉందన్నారు. ఇటువంటి వ్యక్తికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

* దుప్పట్ల వ్యాపారం ముసుగులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడిన నలుగురు సభ్యుల దొంగల ముఠాలో ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 2.40.000 రూపాయలు స్వాధీన పరుచుకున్నామని విలేకరుల సమావేశంలో తెలిపిన డిసిపి వెంకటలక్ష్మి.. పాల్గొన్న ఏసీపీ నరేష్ కుమార్, సీఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది..

* ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ 8 మిలియన్ల మంది ఫాలోవర్లను దాటింది.ట్విట్టర్‌లో యోగి ఆఫీస్ ఖాతా ప్రధాని మోదీ ఆఫీస్ ఖాతా తర్వాత రెండవ అతిపెద్దదిగా నిలిచింది. యూపీ సీఎం యోగికి యాప్‌లో 60 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు యాప్‌లో యోగికి అత్యధికంగా ఫాలోవర్లు ఉన్నారు.యోగి ఆదిత్యనాథ్ కు సోషల్ మీడియాలో ప్రజాదరణ పెరుగుతోంది. యోగి సభలకు జనం లక్షలాదిమంది తరలివస్తుంటారు.ప్రధాని మోదీ కార్యాలయ ఖాతాకు అత్యధికంగా 5.14 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

* రైతులు పండించిన ఆఖరి గింజవరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో వానాకాలం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించి.. అక్కడి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మంత్రి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.

* మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మరణం ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలకు తీరనిలోటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. హనుమకొండలోని మందాడి నివాసం వద్ద ఆయన పార్థివ దేహానికి మంత్రి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మందాడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చూకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

* మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి ఇటీవ‌ల జ‌రిగిన ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలుపొందిన విష‌యం విదిత‌మే. ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారిగా మునోగుడుకు విచ్చేసిన కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి.. అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి, ప్ర‌జ‌ల‌కు అభివాదం చేశారు. కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి విజ‌యోత్స‌వ ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.

* రైల్వే ట్రాక్ మరమ్మతులు, వివిధ నిర్వహణ పనులు, సాంకేతిక లోపాలతో దేశంలో పలు రైళ్లు ప్రతీరోజూ రద్దు అవుతూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా తరచూ రైళ్ల(Trains) రద్దు వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గత 15రోజులుగా దేశంలో పలు ప్రధాన రైలు మార్గాల్లో పలు రైళ్లను భారతీయ రైల్వే(Indian Railways) అధికారులు రద్దు చేశారు. మళ్లీ సోమవారం కూడా దేశంలో 147 రైళ్లను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. మరో 46 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.(Cancels) భారీవర్షాలు, వరదల వల్ల కూడా దేశంలో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆదివారం 160 రైళ్లను రద్దు చేశారు. మళ్లీ సోమవారం 147 రైళ్లు రద్దు చేశారు. పలు కారణాల వల్ల మంగళవారం కూడా పలు రైళ్లను రద్దు చేయనున్నారు.

* సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. డిసెంబర్ 12వ తేదీకి న్యాయమూర్తులు వాయిదా వేశారు. ప్రతివాదులైన ఏపీ సీఐడికి సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకాల ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సీఐడి ఇంకా ఛార్జిషీటు దాఖలు చేయనందువల్ల అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు తరపు న్యాయవాది కోరారు. కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ మంజూరు చేయరాదంటూ బాధితుల తరపు న్యాయవాది సుప్రీంకు తెలిపారు. అధికారి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయినందున పోలీసులతో కుమ్మక్కై విచారణను సాగదీస్తున్నారని బాధితుల తరపు న్యాయవాది వాదించారు. కాగా.. దళిత యువకుడ్ని అతి కిరాతకంగా అనంతబాబు హత్య చేశారు. అనంతబాబుకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అనంతబాబు సవాలు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

* తూర్పుగోదావరి: జిల్లాలోని బిక్కవోలులో తల్లికొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పంచాయతీ అధికారులు తమ ఇంటిని అక్రమంగా తొలగించారంటూ వారు తీవ్ర మనస్తాపం చెందారు. 40 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని తొలగించుకొని కొత్త ఇంటి నిర్మాణం కోసం కోటిపల్లి కామాక్షి, కుమారుడు మురళీకృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ స్థలంలో ఇంటి చుట్టూ పంచాయతీ సిబ్బంది ఫెన్సింగ్ వేసింది. వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే పంచాయతీ అధికారులు తమ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారంటూ ఆత్మహత్యయత్నానికి ముందు తల్లీ కొడుకులు సెల్పీ వీడియో తీసుకున్నారు. పురుగులమందు తాగిన తల్లీకొడుకుల పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు

* ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి మాగంటి బాబు సెటైర్లు వేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఆయన ఏ మాత్రం తప్పు మాట్లాడలేదు.. ఒక్కసారి మాత్రమే ఓటు వెయ్యమన్నారు.. ఇక ఆయనకు ఎవరు ఓటు వెయ్యక్కర్లేదు..’ అంటూ సెటైర్లు వేశారు. ఒక్కసారి సీఎం అయినందుకే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. చాలా మంది స్వార్థ పరులైన టీడీపీ నేతలు (TDP Leaders) కాంట్రాక్టుల కోసం, ఇతర ప్రయోజనాల కోసం వేరే పార్టీలోకి వెళ్లిపోయారని, ముఖ్యంగా గన్నవరం, నూజీవీడు నాయకుల గురించి మాట్లాడుతున్నానన్నారు.* టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు వైఎస్ షర్మిల తీవ్ర హెచ్చరికలు చేశారు. వైఎస్సార్ విగ్రహాలు ఫ్లెక్సీ ధ్వంసం చేస్తే ఊరుకునేదిలేదన్నారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఊపిరి ఉన్నంతవరకు తెలంగాణ గడ్డను వదిలేదిలేదని ఆమె స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నందుకే తనపై, తన పార్టీపై టీఆర్ఎస్ దాడులకు దిగుతోందని ఆరోపించారు. వైఎస్సార్ అభిమానులు, ఆయన పథకాల వల్ల లబ్దిపొందినవారు కోట్లలో ఉన్నారని, ఇలాంటి పనులు చేస్తే సహించరని, రాళ్లు, చెప్పులతో కొట్టే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు. ఇలాంటివాటికి తాను అసలు భయపడనని అన్నారు. ఒక్కసారి దిగిన తర్వాత రాజశేఖర్ బిడ్డ (షర్మిల) వెనుకడుగువేసే ప్రసక్తేలేదని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై మాట్లాడుతున్న ఏకైక వ్యక్తిని తానేనని షర్మిల స్పష్టం చేశారు* హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ – ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. మొత్తం 66 సీట్లు ఉన్నాయి. వీటిలో 16 సీట్లను తెలంగాణ అభ్యర్థుల కోసం ప్రత్యేకించారు. మిగిలిన 50 సీట్లకు దేశవ్యాప్తంగా అభ్యర్థులు పోటీపడవచ్చు. జనరల్‌ కేటగిరీలో మరో ముగ్గురికి అవకాశం కల్పిస్తారు. విదేశీ విద్యార్థులకోసం అదనంగా 13 సీట్లు కేటాయించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి.

* ఈశాన్య రుతుపవనాల ప్రభావంతోపాటు, బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో కుండపోతగా కురిసిన వర్షానికి శివారు ప్రాంతాలైన మాంగాడు, ముగిలివాక్కం దీవులుగా మారాయి. సుమారు 1500లకు పైగా నివాసాల్లో వర్షపు నీరు వరదలా చొరబడటంతో ఆ రెండు ప్రాంతాల్లో నివసిస్తున్నవారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పూందమల్లి, మాంగాడు చుట్టుపక్కలి ప్రాంతాల్లో అన్ని రహదారుల్లో అడుగుమేర వర్షపునీరు పొంగి ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాంగాడు ఓంశక్తినగర్‌, చక్రానగర్‌ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. కుండ్రత్తూరు – మాంగాడు రహదారిలో వరద పరిస్థితులు నెలకొనడంతో స్థానికులు మూటముల్లె సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఓంశక్తినగర్‌ కూడలిలోని కాల్వలో వర్షపునీరంతా జనావాసాల్లోకి ప్రవహించింది. కుండ్రత్తూరు – మాంగాడు రహదారిలో మోకాలి లోతు వర్షపునీరు ప్రవహించడంతో ఆ మార్గంలో నడిచివెళ్లేందుకు కూడా స్థానికులు భయపడుతున్నారు. ఓంశక్తినగర్‌, జనని నగర్‌, సాదిక్‌ నగర్‌ ప్రాంతాల్లో చేరిన వాననీటిని మోటారుు పంపులతో తొలగించడానికి మునిసిపాలిటీ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

* యూనివర్శిటీల పనితీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ , గవర్నర్ ఆరిఫ్ ఖాన్‌ )కు మధ్య తలెత్తిన వివాదం మలుపులు తిరుగుతోంది. స్టేట్ యూనివర్శిటీకి వైస్‌ ఛాన్సలర్‌‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు సోమవారంనాడు కొట్టివేసింది. దీంతో పినరయి విజయన్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలినట్టయింది.

* హైదరాబాద్‌ సిటీ: నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సులు పెరుగనున్న నేపథ్యంలో టీఎస్‌ ఆర్టీసీ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లపై దృష్టిసారించింది. 2-3 నెలల్లో 350 ఎలక్ర్టిక్‌ బస్సులు తీసుకురానున్న నేపథ్యం లో గ్రేటర్‌జోన్‌ పరిధిలోని 28 డిపోల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఒక్కో డిపోలో 5-10 చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ తీసుకువచ్చే ఎలక్ట్రికల్‌ బస్సుల్లో 300 సమీప జిల్లాలకు నడిపితే, 50 బస్సులు గ్రేటర్‌జోన్‌లో నడిపే అవకాశాలున్నాయి. ఇప్పటికే 39 ఎలక్ట్రిక్‌ బస్సులను నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు నడుపుతున్నారు. వీటి చార్జింగ్‌ కోసం మియాపూర్‌, కంటోన్మెంట్‌ డిపోల్లో 10 చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. డీజిల్‌ బస్సుల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్‌ బస్సులు పెంచేదిశగా ఆర్టీసీ ప్రయత్నిస్తుండటంతో భవిష్యత్‌లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లకు భారీగా డిమాండ్‌ నెలకొననుంది. దీంతో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు పెంచనున్నారు.

* శాఖ విమానాశ్రయం సమీపంలో జాతీయ రహదారిపై ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. జాతీయ రహదారిపై గాజువాక నుంచి వస్తున్న లారీ రోడ్డు పనుల నిమిత్తం పెయింటింగ్ వేస్తున్న కార్మికులను తప్పించబోయి అదుపుతప్పిన బోల్తా పడింది. కాగా.. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* శాఖ విమానాశ్రయం సమీపంలో జాతీయ రహదారిపై ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. జాతీయ రహదారిపై గాజువాక నుంచి వస్తున్న లారీ రోడ్డు పనుల నిమిత్తం పెయింటింగ్ వేస్తున్న కార్మికులను తప్పించబోయి అదుపుతప్పిన బోల్తా పడింది. కాగా.. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* ఆక్వా రంగానికి సాయం అందిస్తామని సీఎం చెప్పారని.. కానీ ఏ ఒక్క హమీని జగన్రెడ్డి నెరవేర్చలేదని ఎమ్మెల్యే మంతెన రామరాజు విమర్శించారు. సోమవారం ఉండిలో ఆక్వా రైతు పోరుబాటలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… సబ్సిడీలు ఎగవేయడానికే ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అంటూ ప్రాంతాలను విభజించారని మండిపడ్డారు. ఆక్వా సాగుకు సంబంధిత అనుమతుల ఫీజులు దారుణంగా పెంచేశారని ఎమ్మెల్యే రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* ఉపాధి కోసం ఒమన్‌కు వెళ్లిన తెలంగాణ వ్యక్తి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా, దోమకొండ మండలం, ముత్యంపేట గ్రామానికి చెందిన స్వామి.. కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం ఒమన్ వెళ్లారు. నాలుగు నెలల క్రితం ఆయన కూతురు మేఘమాల అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. గ్రామానికి వచ్చారు. కూతురి అంత్యక్రియల అనంతరం తిరిగి ఒమన్ వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మస్కట్‌లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురి మరణాన్ని తట్టుకోలేకే స్వామి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వామి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

* మురుగ మఠం లింగాయత్ స్వామి శివమూర్తి లీలలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి.మఠంలో అందరూ నిద్రించిన తర్వాత 64 ఏళ్ల స్వామిజీ మైనర్ బాలికలను తన గదికి (Room) పిలిపించుకొని వారికి చాక్లెట్లు, డ్రైఫ్రూట్లు ఇచ్చి అత్యాచారం చేశాడని ఇద్దరు బాలికలు చెప్పినట్లు చార్జ్ షీటులో వెల్లడైంది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు బృందం స్వామిజీ లీలలపై 694 పేజీల ఛార్జిషీటును జిల్లా రెండవ అదనపు సెషన్స్ కోర్టులో సమర్పించారు. ప్రతీరోజూ రాత్రి స్వామిజీ తనను గదికి పిలిపించి తన ప్రైవేటు భాగాలను చేతులతో తడిమి అత్యాచారం చేసి తెల్లవారుజామున 4.30 గంటలకు తిరిగి హాస్టల్ కు పంపిచేవాడని బాధిత బాలిక పేర్కొంది.

* రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల మేజిస్ర్టేట్‌ హోదాలో విధులకు దూరంగా ఉంటున్నారని వారు వాపోతున్నారు. భూ వివాదాలకు సంబంధించిన కోర్టు కేసులను సాకుగా చూపిస్తూ కొందరు వారంలో రెండు రోజులు కూడా కార్యాలయాల్లో విధులు నిర్వర్తించకపోవడంతో పౌరసేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన కులం, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీలో రోజుల తరబడి జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు. జిల్లాలోని రెవెన్యూశాఖ పరిధిలోని 16 మండలాల్లో ప్రస్తుతం 16 మంది తహసీల్దార్లు పనిచేస్తున్నారు. గతంలో రోజువారీగా కార్యాలయాలకు హాజరై పాలన వ్యవహారాలను పర్యవేక్షించే అధికారుల్లో కొందరు ఇటీవలి కాలంలో బాధ్యతలను నిర్వర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పనుల నిమిత్తం తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్తున్న ప్రజలు అధికారులతో తమ బాధలు చెప్పుకునేందుకు, సంతకాల కోసం రోజంతా పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంటుంది.

*జగనన్న ఇళ్ల భూ సేకరణలో భారీ అవినీతి జరిగిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. విశాఖలో రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ నేతలు మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. జనసేనకు ఒక్క అవకాశమిస్తే అవినీతిపరుల తాటతీస్తానని స్పష్టం చేశారు. ‘జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు’ పేరుతో జనసేన చేపట్టిన లేఅవుట్ల సందర్శనలో భాగంగా విజయనగరం జిల్లా విజయనగరం మండల పరిధిలో గుంకలాం వద్ద ఇళ్ల స్థలాల లేఅవుట్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. నామ్‌కే వాస్తేగా ఇళ్ల నిర్మాణం ఉందని ఈ సందర్భంగా అన్నారు. జగనన్న ఇళ్లకు భూ సేకరణలోనే భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. రూ.23,500 కోట్లు ఖర్చు చేసినట్లు చూపుతున్న ప్రభుత్వం.. ఇందులో రూ.15 వేల కోట్లు పక్కదారి పట్టించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున భూ సేకరణ నిధులను దారి మళ్లించారని అన్నారు. ఎకరం రూ.2-4లక్షలకే కొనుగోలు చేసి.. రూ.18 లక్షల నుంచి 30 లక్షల వరకు కొన్నట్లు చూపారని, ప్రజాధనం కొల్లగొట్టేశారని ధ్వజమెత్తారు. కేంద్రం ఒక్కో ఇంటికి అందించిన రూ.1.80 లక్షలను రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు కట్టకుండానే ఇతర పనులకు వినియోగించారని చెప్పారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తికావడం లేదని.. లబ్ధిదారులు దారుణంగా మోసపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

*గురుగ్రామ్ దంపతులు తమ పెంపుడు కుక్కకు భారతీయ సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించిన విచిత్ర ఘటన వెలుగుచూసింది. గురుగ్రామ్(Gurugram) నగరానికి చెందిన సవిత అలియాస్ రాణి స్వీటీ అనే ఆడకుక్కను పెంచుకుంటోంది. తన భర్త గుడికి వెళ్లి కుక్కలకు ఆహారం పెట్టి వచ్చేవాడు. ఓ వీధి కుక్క తన భర్తను అనుసరించి ఇంటికి వచ్చింది. దీంతో దానికి స్వీటీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నామని సవిత చెప్పారు. తాము పెంచుకుంటున్న స్వీటీకి పెళ్లి(Dog Wedding) చేద్దామని నిర్ణయించుకొని పొరుగున ఉన్న మరో కుక్కను చూశామని కుక్క యజమానురాలు సవిత చెప్పారు.

* వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించడానికి ఉద్దేశించిన పార్లమెంటరీ స్థాయీ సంఘాల సమావేశాలకు చాలా మంది ఎంపీలు హాజరు కావడం లేదు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు కలిపి ప్రతి కమిటీలో 31 మంది ఉంటారు. అయితే సగటున 16 మందికి మించి రావడం లేదు. డజనకుపైగా కమిటీలు ఉండగా సభ్యుల గైర్హాజరు 40 శాతంపైగానే ఉంటోంది. గైర్హాజరయ్యే ప్రముఖుల్లో బీజేపీకి చెందిన హేమమాలిని, మేనకా గాంధీ, ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌, కాంగ్రెస్‌ సభ్యుల్లో రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, పి.చిదంబరం తదితరులు ఉన్నారు. ఈ జాబితాలో జయా బచ్చన్‌ (ఎస్పీ), హర్భజన్‌ సింగ్‌ (ఆప్‌), ఇళయరాజా (నామినేటెడ్‌), కపిల్‌ సిబల్‌ (ఇండిపెండెంట్‌), అభిషేక్‌ బెనర్జీ (తృణమూల్‌), నవనీత్‌ రాణా, మీసా భారతి తదితరులు ఉన్నారు. బీజేపీ సభ్యుల హాజరు తక్కువగా ఉండడాన్ని ప్రధాని మోదీ గుర్తించారు కూడా. సమావేశాలకు తప్పనిసరిగా వెళ్లాలని ఆయన పలుమార్లు సూచించారు. ఏ సంఘం సమావేశం ఎప్పడు జరిగింది, ఎందరు సభ్యులు హాజరయ్యారన్న విషయాలను లోక్‌సభ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

*పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ నగరంలో సోమవారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. 120 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. పంజాబ్(Punjab) రాష్ట్రంలోని అమృత్‌సర్‌(Amritsar) నగరంలో సోమవారం తెల్లవారుజామున 3.42 గంటలకు సంభవించిన భూప్రకంపనలతో(Earthquake) గాఢనిద్రలో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గడచిన వారం రోజుల్లో ఢిల్లీ ప్రాంతంలో రెండు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. వరుస భూప్రకంపనలతో ఉత్తర భారతదేశ ప్రజలు కలవరపడుతున్నారు

* ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే.. వారిని కూడా నిందితులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఏడు బృందాలతో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. తెలంగాణతోపాటు ఫరీదాబాద్‌, కేరళ మరికొన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు మొయినాబాద్‌ ఫాంహౌ్‌సలో పట్టుబడ్డ ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ల నెట్‌వర్క్‌ను ట్రేస్‌ చేస్తోంది. నిందితుల కాల్‌ డేటా, డైరీల ఆధారంగా కీలక సమాచారం కోసం శనివారం నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు.

*విద్యుత్తు సవరణ బిల్లు-2022కు వ్యతిరేకంగా ఈ నెల 23న విద్యుత్‌ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు దేశ రాజధాని ఢిల్లోలో ప్రదర్శన నిర్వహించనున్నారు. విద్యుత్తు సరఫరా రంగంలో ప్రయివేటు సంస్థలను అనుమతిస్తూ లోక్‌సభ ఆమోదించిన బిల్లును వ్యతిరేకిస్తూ రాంలీలా మైదాన్‌ నుంచి జంతర్‌మంతర్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐపీఈఎఫ్‌) తెలిపింది. బిల్లు ఉపసంహరణ, పాత పింఛను విధానం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడం వంటి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నట్టు ఏఐపీఈఎఫ్‌ చైర్మన్‌ శైలేంద్ర దూబే చెప్పారు.

*ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ తరఫున టిక్కెట్‌ దక్కలేదనే ఆక్రోశంతో ఆప్‌ మాజీ కౌన్సిలర్‌ హసీబ్‌-ఉల్‌-హసన్‌ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. విద్యుత్‌ టవర్‌ ఎక్కి చనిపోతానని బెదిరించాడు. పార్టీ నేతలు అతిషి, దుర్గేష్‌ పాఠక్‌, సంజయ్‌ సింగ్‌లు టికెట్లు అమ్ముకుంటున్నారని, తన చావుకు వారే కారణమని ఆరోపించాడు. ఈ సంఘటన ఆదివారం ఢిల్లీలో కలకలం రేపింది. డిసెంబరు 4న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆప్‌ రెండు విడతలుగా విడుదల చేసింది. సిటింగ్‌ కౌన్సిలర్‌ అయిన హసన్‌కు టికెట్‌ నిరాకరించడంతో ఆందోళనకు దిగి కొద్దిసేపు హల్‌చల్‌ చేశాడు.

*ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే.. వారిని కూడా నిందితులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఏడు బృందాలతో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. తెలంగాణతోపాటు ఫరీదాబాద్‌, కేరళ మరికొన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు మొయినాబాద్‌ ఫాంహౌ్‌సలో పట్టుబడ్డ ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ల నెట్‌వర్క్‌ను ట్రేస్‌ చేస్తోంది. నిందితుల కాల్‌ డేటా, డైరీల ఆధారంగా కీలక సమాచారం కోసం శనివారం నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు.

*రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆదివారం ఉదయం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ‘కానిస్టేబుల్‌, ఎస్‌ఐ అభ్యర్థులకు ఉచిత శారీరక దృఢత్వ ఉచిత శిక్షణా కేంద్రం’లో పాలు, గుడ్లను పంపిణీ చేసి మాట్లాడారు. పట్టుదలతో ఉద్యోగం సాధిస్తే ఒక ప్రజాప్రతినిధిగా అదే తమకు నిజమైన ఆనందమని అభ్యర్థుల్లో స్ఫూర్తిని నింపారు. ఉచిత శిక్షణ తరగతులను అభ్యర్థులంతా ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హాజరయ్యారు. చంద్లాపూర్‌ గ్రామంలోని లక్ష్మీ రంగనాయకస్వామి ఫంక్షన్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

*కరీంనగర్‌ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు నిరసన సెగ తగిలింది. గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఆందోళనకారులు రసమయిని అడ్డుకునే యత్నం చేశారు. గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మండల కేంద్రం వరకు డబుల్‌ రోడ్డు మంజూరు చేయాలని మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గుండ్లపల్లిలో మహాధర్నా చేపట్టారు. వివిధ గ్రామాల యువజన నాయకులు భారీ సంఖ్యలో రాజీవ్‌ రహదారిపై ధర్నాకు దిగారు. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు బీజేపీ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. ఆ సమయంలో బెజ్జంకి వైపు వెళుతున్న రసమయి గుండ్లపల్లికి చేరుకున్నారు. ఎమ్మెల్యే వాహనాన్ని గమనించిన ఆందోళనకారులు అడ్డుకునేందుకు యత్నించారు. ఆయన వాహనాన్ని ఆపకుండా ముందుకు వెళ్లడంతో కొంత మంది రాళ్లు విసిరారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి పరిస్థితిని అదుపు చేశారు. యువజన సంఘాలు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, కావాలనే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు రెచ్చగొట్టి తనపై దాడికి ఉసిగొల్పారని ఆరోపించారు. మండల కేంద్రానికి డబుల్‌ రోడ్‌ కోసం ప్రతిపాదనలను తయారు చేయించి ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు.

*కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ సీఎండీ గుర్‌దీప్‌ సింఘ్‌ ఆదివారం రామగుం డం ప్రాజెక్టులో పర్యటించా రు. ఆదివారం ఎన్టీపీసీ ఆధ్వర్యంలోని ప్రాజెక్టులను పరిశీలించారు. నిర్మాణ పను లు చివరి దశలో ఉన్న 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఎస్‌టీపీపీ)లో పర్యటించారు.

*ప్రజల కోసం జీవితాంతం నిలిచిన మహా కవి కాళోజీ నారాయణరావు అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య అన్నారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ భవనంలో కాళోజీ వర్ధం తిని ఘనంగా నిర్వహించారు.

*వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించడానికి ఉద్దేశించిన పార్లమెంటరీ స్థాయీ సంఘాల సమావేశాలకు చాలా మంది ఎంపీలు హాజరు కావడం లేదు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు కలిపి ప్రతి కమిటీలో 31 మంది ఉంటారు. అయితే సగటున 16 మందికి మించి రావడం లేదు. డజనకుపైగా కమిటీలు ఉండగా సభ్యుల గైర్హాజరు 40 శాతంపైగానే ఉంటోంది. గైర్హాజరయ్యే ప్రముఖుల్లో బీజేపీకి చెందిన హేమమాలిని, మేనకా గాంధీ, ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌, కాంగ్రెస్‌ సభ్యుల్లో రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, పి.చిదంబరం తదితరులు ఉన్నారు. ఈ జాబితాలో జయా బచ్చన్‌ (ఎస్పీ), హర్భజన్‌ సింగ్‌ (ఆప్‌), ఇళయరాజా (నామినేటెడ్‌), కపిల్‌ సిబల్‌ (ఇండిపెండెంట్‌), అభిషేక్‌ బెనర్జీ (తృణమూల్‌), నవనీత్‌ రాణా, మీసా భారతి తదితరులు ఉన్నారు. బీజేపీ సభ్యుల హాజరు తక్కువగా ఉండడాన్ని ప్రధాని మోదీ గుర్తించారు కూడా. సమావేశాలకు తప్పనిసరిగా వెళ్లాలని ఆయన పలుమార్లు సూచించారు. ఏ సంఘం సమావేశం ఎప్పడు జరిగింది, ఎందరు సభ్యులు హాజరయ్యారన్న విషయాలను లోక్‌సభ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

*విద్యుత్తు సవరణ బిల్లు-2022కు వ్యతిరేకంగా ఈ నెల 23న విద్యుత్‌ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు దేశ రాజధాని ఢిల్లోలో ప్రదర్శన నిర్వహించనున్నారు. విద్యుత్తు సరఫరా రంగంలో ప్రయివేటు సంస్థలను అనుమతిస్తూ లోక్‌సభ ఆమోదించిన బిల్లును వ్యతిరేకిస్తూ రాంలీలా మైదాన్‌ నుంచి జంతర్‌మంతర్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐపీఈఎఫ్‌) తెలిపింది. బిల్లు ఉపసంహరణ, పాత పింఛను విధానం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడం వంటి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నట్టు ఏఐపీఈఎఫ్‌ చైర్మన్‌ శైలేంద్ర దూబే చెప్పారు.

* మహా రాష్ట్రలోని ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శుక్రవారం వివిధ ఆపరేషన్లలో రూ.32 కోట్ల విలువైన 61 కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఒక్క రోజులో కస్టమ్స్‌ అధికారులు ఇంత భారీమొత్తంలో బంగారాన్ని సీజ్‌ చేయడం చరిత్రలో తొలిసారి.

* మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హంతకులను విడుదల చేయటం సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హంతకులపై సానుభూతి అవసరం లేదని అన్నారు.