DailyDose

జోకోవిచ్‌కు వీసా జారీ చేసిన ఆస్ట్రేలియా..

జోకోవిచ్‌కు వీసా జారీ చేసిన ఆస్ట్రేలియా..

టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడ‌నున్నారు. అత‌నిపై ఉన్న మూడేళ్ల వీసా నిషేధాన్ని ప్ర‌భుత్వం ఎత్తివేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో వివాదాస్ప‌ద రీతిలో జోకోవిచ్‌ను ఆస్ట్రేలియా నుంచి వెళ్ల‌గొట్టిన విష‌యం తెలిసిందే. క‌రోనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఆస్ట్రేలియా ఓపెన్‌లో పోటీప‌డేందుకు జోకోవిచ్ ప్ర‌య‌త్నించాడు. అయితే వ్యాక్సిన్ తీసుకోకుండా ఆస్ట్రేలియాలోకి ఎంట‌ర్ అయినందుకు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. గ‌త ఏడాది టోర్నీకి రెండు వారాల ముందు జోకోవిచ్‌ను అరెస్టు చేసి, ఆ త‌ర్వాత దేశం నుంచి వెళ్ల‌గొట్టారు. ఆ స‌మ‌యంలో అత‌నిపై మూడేళ్ల వీసా నిషేధం విధించారు.