NRI-NRT

సౌదీలో తెలంగాణ యువకుడు మృతి

తెలంగాణలో సౌదీ యువకుడు మృతి.

భగభగమండె సౌదీ అరేబియా ఎడారులలో ఎండ ఎంత తీవ్రంగా ఉంటుందో చలి కూడ అదే స్ధాయిలో ఉంటుంది, శీతల కాలంలో చలి బారి నుండి కాపాడుకోవడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రత్యెకించి రాత్రి వేళలలో హీటర్లను వినియోగిస్తారు. ఈ క్రమంలో ప్రతి శీతల కాలంలో సౌదీ అరేబియా, కువైత్ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో తెలుగువారితో సహా అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతుంటారు.

తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూరం మండలం మస్కపూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ళ అబ్దుల్ జహీర్ అనే యువకుడు సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో హీటర్ పొగతో ఊపిరాడక మరణించాడు. చలి బారి నుండి కాపాడుకోవడానికి రాత్రి హీటర్ స్వీచ్చాన్ చేసిన పడుకోన్న జహీర్ మరియు ఇతర ఇద్దరు సహచరులు నిద్ర మత్తులో హీటర్ నుండి వెలువడిన పొగను గమనించలేదు, అకస్మాత్తుగా నిద్ర లేచే వరకు ఊపిరాడక జహీర్ మరణించగా ఇతర ఇద్దరు అస్వస్ధకు గురయి ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. మరణానికి సంబంధించి అధికార ప్రక్రియను పూర్తి చేయడానికి సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సామాజిక కార్యకర్తలు ముజమ్మీల్ శేఖ్, అబ్దుల్ రఫీక్ లు ప్రయత్నిస్తున్నారు.

కొద్ది కాలం క్రితం భారీ బస్సు ప్రమాదం దుర్ఘటన నుండి ప్రాణపాయం నుండి తప్పించుకోన్న జహీర్ అనూహ్యంగా మరణించాడు. అతని తండ్రి క్యాన్సర్ కారణాన దీనస్ధితిలో మరణించగా అతని చికిత్స కొరకు జహీర్ సౌదీ అరేబియాలో తెలిసిన వారి నుండి పెద్ద ఎత్తున అప్పులు చేసినట్లుగా సమాచారం.

వెచ్చదనం కొరకు వినియోగించె హీటర్లలో అత్యధికం విద్యుత్ తో అపరేట్ అయినా ఆయిల్ ఆధారంగా మరియు కొన్ని కాయిల్ ఆధారంగా వేడిను ఉత్పత్తి చేస్తాయి. గ్రామీణ ప్రాంతాలలో, వ్యవసాయ క్షేత్రాలలో డిసెల్, కిరోసిన్ నుండి నడిచె హీటర్లను కూడ ఇక్కడ వినియోగిస్తారు. వీటి నుండి వెలువడయ్యె పొగ నుండి ఉత్పన్నమయ్యె కార్బన్ మోనోక్సాయిడ్ CO వాయువు వలన ఊపిరాడక మరణాలు స్తంభిస్తాయి. రాత్రి వేళలో నిద్రలో హీటర్లు స్విచ్చాఫ్ చేయక, చలిలో పడుకోవడంతో పొగ పెరిగి తరుచుగా ఈ రకమైన ప్రమాదాలు జరుగుతాయి. ఏలాంటి వాసన, రంగు లేని ఈ పొగ నిశబ్దంగా మానవుల ప్రాణాలను బలిగొంటుంది.

సౌదీ అరేబియాలో ప్రతి శీతల కాలంలో 70 లక్షలకు పైగా విద్యుత్, ఆయిల్ హీటర్లను వెచ్చదనం కొరకు వాడుతారని ఒక అధికారిక నివేదిక, వీటి వినియోగంలో రాత్రి వేళలలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తరుచుగా విజ్ఞప్తులు కూడ చేస్తుంది.