Politics

తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉంది.. డాక్టర్లు వెల్లడి

తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉంది.. డాక్టర్లు వెల్లడి

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల

పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్న ఆసుపత్రి వర్గాలు

– ఎక్మో సపోర్ట్ అంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని వెల్లడి

★ నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది.

★ తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు.

★ తారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలిపారు. కాగా, తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని మీడియాలో ప్రచారం జరుగుతోందని, అందులో నిజంలేదని బులెటిన్ లో స్పష్టం చేశారు.

★ తారకరత్నకు ఇప్పటివరకు ఎక్మో సపోర్ట్ అందించనేలేదని వివరించారు.

★ తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అభిమానులకు సమాచారం అందిస్తున్నారని, తారకరత్న ఆరోగ్యంలో ఏదైనా మెరుగుదల కనిపిస్తే తప్పకుండా పంచుకుంటామని నారాయణ హృదయాలయ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.

★ ప్రజలెవరూ తారకరత్నను చూసేందుకు రావొద్దని, చికిత్సకు అంతరాయం కలగకుండా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.