Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు.

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *08.02.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (08-02-2023)

పనులను వాయిదా వేయకుండా పూర్తిచేయాలి. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. చంద్రధ్యానం మంచిది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (08-02-2023)

ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (08-02-2023)

ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు ప్రశంసిస్తారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ మంచిది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (08-02-2023)

శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (08-02-2023)

అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (08-02-2023)

ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. మనఃస్సౌఖ్యం
ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (08-02-2023)

అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (08-02-2023)

మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (08-02-2023)

మనః స్సౌఖ్యం ఉంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల గురించి కాలాన్ని వృథా చేయకండి. మనఃశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (08-02-2023)

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (08-02-2023)

శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎట్టకేలకు ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేయగలుగుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (08-02-2023)

మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవిందనామాలు చదివితే
బాగుంటుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈