Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 *22.03.2023 ✍🏻*
🗓 *నేటి రాశి ఫలాలు 🗓*

🐐 మేషం
ఈరోజు (22-03-2023)

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మరోవైపు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈరోజు చాలా బాధ్యతలు మీ ముందుకొస్తాయి. ఏది ముందుగా పూర్తి చేయాలో, ఏది తర్వాత చేయాలో ఆలోచించాలి. ఈరోజు మీరు కొంత మానసిక ఒత్తిడిని అనుభవించొచ్చు. మీ కుటుంబ వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి కష్టపడతారు. ఈ సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (22-03-2023)

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంద. మీరు ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే, ఈరోజు చేయకూడదు. ఈరోజు మీరు చాలా విషయాల్లో తెలివిగా వ్యవహరించాలి. మీ పనులను త్వరగా పూర్తి చేయాలి. మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. అత్తమామల వైపు నుంచి ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఈరోజు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (22-03-2023)

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు పని చేసే రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు. మీరు పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ కుటుంబంలో ఏదైనా చర్చ జరిగితే అది నేటితో ముగుస్తుంది. ఈరోజు మీరు మీ తండ్రి ఆరోగ్యం కొంత ఆందోళన చెందుతారు. ఈరోజు కొందరు పాతమిత్రులను కలవడం వల్ల ఆనందంగా ఉంటుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (22-03-2023)

ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పిల్లల వివాహాలలో వస్తున్న అడ్డంకులు ఈరోజు తొలగిపోతాయి. ఈ కారణంగా మీ మనసులో శాంతిని పొందుతారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలి. వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (22-03-2023)

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొస్తాయి. ఈరోజు మీ ఆఫీసులో కొందరు ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. మీరు చాలా శ్రద్ధగా ఉండాలి. మీరు వారి కుట్రల్లో పడాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ జీవితంలో పరస్పర అంగీకారంతో సమస్యలన్నీ ముగిసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు మంచి అవకాశాలొస్తాయి.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (22-03-2023)

ఈ రాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో పూర్తి విజయం సాధిస్తారు. అయితే ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నించొచ్చు. వ్యాపారులకు ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈ కారణంగా మీ మనసులో ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు శ్రద్ధగా చదవాల్సి ఉంటుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (22-03-2023)

ఈ రాశి వారికి ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడి పని చేసినా ఆదాయం తక్కువగా ఉంటుంది. మీ ఖర్చులు పెరగడంతో మానసిక ఒత్తిడికి లోనవుతారు. రహస్య శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. మీ కుటుంబ జీవితంలో కలహాలు ఎక్కువగా ఉంటాయి. మీకు సాయంత్రానికి కాస్త ఉపశమనం లభిస్తుంది. మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (22-03-2023)

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో అదృష్టం పొందుతారు. రాబోయే రోజుల్లో మీరు అనేక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు ఈరోజు కొన్ని పనులకు సంబంధించి కార్యాలయంలో తండ్రి సలహా అవసరం అవుతుంది. మీ తోబుట్టువులతో సంబంధాలు మధురంగా ఉంటాయి. మీరు చిన్న కుటుంబ సభ్యులతో సాయంత్రం సరదాగా గడుపుతారు.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (22-03-2023)

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదమైన ఫలితాలు రాకపోవచ్చు. మీకు కొన్ని శారీరక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్నేహితుల నుంచి మీరు ధన లాభం పొందే అవకాశం ఉంది. మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. ఈ సాయంత్రం మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలకు హాజరుకావొచ్చు. మీ జీవిత భాగస్వామి కోసం బహుమతులను కొనుగోలు చేయొచ్చు. మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (22-03-2023)

ఈ రాశి వారు ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు. మీరు కొందరు పెద్దలను కలవడం వల్ల సంతోషంగా ఉంటుంది. ఉన్నతాధికారుల సాయంతో భూమి, ఆస్తికి సంబంధించిన సమస్యలు ముగుస్తాయి. మీ పదవి కాలంలో పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే అవి మీ కష్టాలను పెంచుతాయి. ఈ సాయంత్రం మీ ఇంటికి అతిథి రావొచ్చు.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (22-03-2023)

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు పెద్దల ఆశీర్వాదంతో మంచి పురోగతికి అవకాశాలను పొందుతారు. మీ సోదరుల మధ్య విభేదాలు పెరగొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను సంయమనం పాటించాలి. మీరు ఎక్కడి నుంచైనా డబ్బును పొందే బలమైన అవకాశాలున్నాయి. ఈ కారణంగా మీరు ఆర్థిక స్థితిని బలోపేతం చేయగలుగుతారు. మీరు మీ మతపరమైన పనులపై ఆసక్తి పెంచుకుంటారు. ఈ కారణంగా మీకు గౌరవం పెరుగుతుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (22-03-2023)

ఈ రాశి వారిలో వ్యాపారులు ఎక్కువ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. రాబోయే కాలంలో మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు కొత్త ఆదాయ వనరులు పొందుతారు. మరోవైపు ఈరోజు ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, ఈరోజు చాలా మంచిగా ఉంటుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈