Business

పెట్టుబడులకు ఎల్‌ఐసీ కళ్లెం రుణ..

పెట్టుబడులకు ఎల్‌ఐసీ కళ్లెం రుణ..

స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులకు పరిమితులు విధించాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) యోచిస్తున్నది. అదానీ గ్రూప్‌ సంస్థల్లో పెట్టుబడులు.. తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం అప్రమత్తమవుతున్నట్టు తెలుస్తున్నది.

పెట్టుబడులకు ఎల్‌ఐసీ కళ్లెం
రుణ, స్టాక్‌ మార్కెట్ల ఇన్వెస్ట్‌మెంట్లకు పరిమితులు? అదానీ నష్టాల ప్రభావం
న్యూఢిల్లీ, మార్చి 24: రుణ, స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులకు పరిమితులు విధించాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) యోచిస్తున్నది. అదానీ గ్రూప్‌ సంస్థల్లో పెట్టుబడులు.. తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం అప్రమత్తమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆయా సంస్థలకు సంబంధించి డెట్‌, ఈక్విటీ పెట్టుబడులపై నిర్దిష్ట పరిమితిని పెట్టాలని ఎల్‌ఐసీ భావిస్తున్నట్టు ప్రముఖ వార్తా ఏజెన్సీ రాయిటర్స్‌ నివేదిక ఒకటి చెప్తున్నది.

ఇకపై ఒకే ప్రమోటర్లకు చెందిన వేర్వేరు సంస్థల్లో ఎడాపెడా పెట్టుబడులు పెట్టవద్దని, నిర్ణీత పరిమితికి లోబడే ఇన్వెస్ట్‌మెంట్లుండేలా చూసుకోవాలని ఎల్‌ఐసీ అనుకుంటున్నట్టు సమాచారం. కాగా, ఎల్‌ఐసీ నిర్వహణలోని ఆస్తులు దాదాపు 539 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇందులో 4 బిలియన్‌ డాలర్లకుపైగా అదానీ గ్రూప్‌ సంస్థల్లో పెట్టుబడులుగా వెళ్లాయి. అయితే హిండెన్‌బర్గ్‌ రిపోర్టుతో స్టాక్‌ మార్కెట్లలో అదానీ షేర్లు కుప్పకూలగా.. ఎల్‌ఐసీకి కూడా భారీ నష్టమే వాటిల్లింది. దీ

నిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా.. ఇది రాజకీయంగానూ పెద్ద చర్చకే దారితీసింది. అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడుల నిర్ణయాలపై దర్యాప్తు జరుపాలని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌సహా ప్రతిపక్షాలన్నీ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనూ ఇది అలజడిని సృష్టిస్తున్నది. ప్రస్తుతం ఏ సంస్థలోనైనా అటు ఔట్‌స్టాండింగ్‌ ఈక్విటీలో, ఇటు ఔట్‌స్టాండింగ్‌ డెట్‌లో 10 శాతం చొప్పున ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంతకుమించి చేయరాదు. అయితే కొత్తగా పరిమితులు వస్తే ఇంతకంటే తక్కువకే ఎల్‌ఐసీ ఇన్వెస్ట్‌మెంట్లు పరిమితం కానున్నాయి.