Business

రేపు అక్షయ తృతీయ ఆ..రోజునే చందనోత్సవం ఎందుకు ?…

రేపు అక్షయ తృతీయ  ఆ..రోజునే చందనోత్సవం ఎందుకు ?…

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿సింహాచలంలో వరాహ నరసింహ స్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది !

🌸ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు.

🌿దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజ రూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు.

🌷ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ?🌷

🌸పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు , విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం తెలిసిందే.

🌿ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువుండమంటూ ప్రహ్లాదుడు నారసింహుని వేడుకున్నాడు. ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వెలిశారు.

🌸ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి , నిత్యం ఆయనను కొలుచుకునేవాడట ప్రహ్లాదుడు. అయితే కాలం మారింది. యుగం మారింది. సింహాచలం మీద ఉన్న ఆలయం శిథిలమైపోయింది.

🌿చాలా సంవత్సరాల తరువాత ఈ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చాడు.

🌸అప్పుడు ఆయనకు స్వామివారు కలలో కనిపించి…. తన విగ్రహం ఒక పుట్టచేత కప్పబడి ఉందనీ , ఆ పుట్టని తొలగించి తనని దర్శించమనీ చెప్పారు.

🌿అప్పుడు పురూరవ మహారాజు సహస్ర ఘటాలతో పుట్ట మీద నీరు పోసి స్వామివారి నిజరూపాన్ని దర్శించారు. ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని స్థలపురాణం చెబుతోంది.

🌸ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యావత్తూ తల్లడిల్లిపోగలదు.

🌿 అందుకనే తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి నారసింహుడు ఆదేశించారు.

🌸ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరనీ, మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్య రూపాన్ని మాత్రమే చూస్తారనీ అనుగ్రహించారు.

🌿అలా స్వామి వారి ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజ రూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు…🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿