DailyDose

TNI నేటి తాజా వార్తలు. తెలంగాణలో మాదే అధికారం తదితర విశేషాలు

TNI నేటి తాజా వార్తలు. తెలంగాణలో మాదే అధికారం తదితర విశేషాలు

* వివేకా హత్య కేసు : నాలుగో రోజు కొనసాగుతున్న వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ ల కస్టడీ విచారణ.. చంచల్‌గూడ జైలు నుండి ఇద్దరినీ సీబీఐ కార్యాలయానికి తరలించిన అధికారులు..

సాయంత్రం వరకు కొనసాగనున్న విచారణ

* హైదరాబాద్

సీనియర్ నటుడు శరత్ బాబు గారి ఆరోగ్యం నిన్న కొంచెం సీరియస్ గా ఉండటం తో బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశారు..

ప్రస్తుతం హైదరాబాద్ AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు..

ప్రస్తుతం ఆరోగ్యం నిలగడగా ఉంది..

ఈ రోజు ఉదయం ICU నుంచి రూమ్ కి షిఫ్ట్ చేసారు…

* తెలంగాణ పర్యటనకు ముందు అమిత్‌షా కీలక వ్యాఖ్యలు

దక్షిణాదిలో కూడా బలపడుతున్నాం

కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం

తెలంగాణలో పూర్తి మెజార్టీ సాధిస్తాం
– అమిత్ ‌షా

* నేటి నుండి గంగానది పుష్కరాలు

కోట్లాది మందికి జీవన్ముక్తిని ప్రసాదించే పరమపావని గంగమ్మకు ఈ యేడాది పుష్కరాలు.

వైశాఖ శుద్ధ విదియ శుక్రవారం అనగా ది.21-4- 20. రాత్రి 5-15 ని.లకు (తెల్లవారుజామున, తెల్లవారితే శనివారం) దేవ గురుడు బృహస్పతి తన మిత్ర స్థానమైన మేషరాశిలో ప్రవేశిస్తుండటం వల్ల 22వ తేదీ ఉదయం నుంచి గంగా పుష్కరములు ప్రారంభమయ్యి మే 3వ తేదీ వైశాఖ శుద్ధ త్రయోదశి వరకు జరుగుతాయి. పుష్కరములు మొదలు నుంచి సార్ధ త్రికోటి దేవతా సహితముగా బృహస్పతి గంగానదీ జలాల్లో ఉండటం చేత స్నాన, దాన, తర్పణ, పిండ ప్రధానములు చేయట ఎంతో శ్రేయస్కరం. దీని వలన పితృదేవతలు తరించి కుటుంబ వృద్ధి జరుగుతుంది.

గంగా జన్మస్థానం నుంచి హరిద్వార్, రిషికేష్, అలహాబాద్, కాశీ మొదలుగు క్షేత్రాల్లో పరమపవిత్ర గంగానదికి పూజాదికాలు నిర్వహించి, ఆ పుణ్యజలాల్లో స్నానమాచరించి, పుష్కర తీర్థ విధి చేయాలి. గంగా అని స్మరించినంత మాత్రాన ముక్తినిచ్చే ఆ సురగంగ పుష్కర విధితో పరవశించి, అనన్యమైన, అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుంది.

పుష్కర గాథ

తుందిలుడు అనే గంధర్వుడు ఈశ్వరుని ప్రసన్నం చేసుకుని, తనకు ఆయనలో శాశ్వతస్థానం కల్పించమని అర్థించాడు. అప్పుడు ఈశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో తుందిలునికి శాశ్వతస్థానం కల్పించాడు. ఆవిధంగా మూడున్నర కోట్ల తీర్థాలకు తుందిలుడు అధిపతి అయ్యాడు. పుష్కరం అంటే పుణ్యజలం అనే అర్థం కూడా ఉంది. జలాలకు అధికారి. అయినందున తుందిలుడు పుష్కరుడయ్యాడు. పుష్కరుడు అంటే పోషించేవాడని కూడా అర్థం ఉంది. నదీజలాలకు అధిపతి అయిన బృహస్పతి వివిధ రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు పుష్కరుడు ఆయా నదీజలాల్లో ప్రవేశిస్తాడు. ఈ సందర్భాన్నే పుష్కరాలుగా వ్యవహరిస్తారు.

విష్ణు స్వరూపం

మహావిష్ణువే గంగగా రూపుదాల్చాడని భారతీయుల విశ్వాసం. బృహద్ధర్మ పురాణం ప్రకారం పరమశివుని తాండవ నృత్యానికి, సామవేద గానానికి పరవశించిన కేశవుడు ద్రవరూపాన్ని పొందాడు. అది చూచి చకితుడైన బ్రహ్మ ఆ పవిత్ర జలాన్ని చకచకా తన కమండలంలో నింపుకున్నాడు. ఆ పావన జలంతోనే వామనమూర్తి వామపాదాన్ని సమంచితంగా కడిగి కళ్లకద్దుకున్నాడు. గమయతి ఇతి గంగా… నిరంతరం గతిశీలంగా ఉండేది కనుక గంగ అని పిలుస్తారు. గమయతి స్వర్గం, భగవత్పదం ఇతి…. స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగించేది గంగ అంటారు. కొందరు రామకృష్ణాది రూపంగా అవతరించిన నిరాకార భగవంతుడినే పూజిస్తారు. మరికొందరు నిర్గుణ నిరాకార బ్రహ్మమునే ధ్యానిస్తారు. కానీ, సాంసారిక తాపత్రయ అగ్నిలో పరితపిస్తున్న మేము మాత్రం గంగారూపంగా జలాకారుడైన జగన్నాథుడినే సేవిస్తాం అని ఉత్తములు భావిస్తుంటారు.

* అల్లూరి సీతారామ జిల్లా

డబ్బులు తీసుకుని గంజాయితో వెళ్తున్న కారును వదిలేసిన చింతూరు ఎస్సై ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన

ఇటీవల నెల్లూరులో గంజాయితో వెళుతున్న కారును, నిందితులను ఎస్ఈబీ అధికారులకు పట్టుకున్నారు

తమ వద్ద చింతూరు సబ్ డివిజన్ లో ఓ ఎస్ఐ సొమ్ము తీసు కున్నట్లు విచారణలో గంజాయి నిందితులు వెల్లడి

దీనిపై వారు రంపచోడవరం పోలీసులకు సమాచారమిచ్చిన అక్కడి పోలీసుల బృందం

నెల్లూరు పోలీసులు వచ్చి చింతూరు నుంచి సదరు ఎస్ఐను రంపచోడవరం పోలీసుస్టేషకు తరలించారు

అయితే అక్కడి నుంచి ఆయన పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు ఊహగానాలు.

* ప్రపంచ మహోపాధ్యాయుడు V. I. లెనిన్ 153 వ జయంతి సందర్భంగా విజయవాడలో లెనిన్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న CPI రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ,CPM రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు తదితరులు

* పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పార్వతీపురం మన్యం జిల్లాలో చేసిన విద్యాశాఖ అధికారుల సస్పెన్షన్లు ఉపసంహరించుకోవాలి. శ్రీ ప్రవీణ్ ప్రకాష్ తన ధోరణి మార్చుకోవాలి- కేఎస్ లక్ష్మణ్ రావు ఎమ్మెల్సీ

🌺అక్షయ తృతీయ🌺 రోజు బంగారం కొనమని ఏ శాస్త్రంలో లేదు.

వీలైతే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వండి. బీదవాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి. అక్షయ తృతీయ విశేషం ఏమిటో తెలుసుకుందాం.
1.పరశు రాముడు జన్మించిన రోజు.
2. పవిత్ర గంగానది భూమిని తాకిన రోజు.
3. త్రేతాయుగం మొదలైన రోజు.
4. శ్రీకృష్ణుడు తన బాల్య మిత్రుడైన కుచేలుని కలుసుకొన్న రోజు.
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలు పెట్టిన రోజు.
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన రోజు.
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింప బడిన రోజు.
8. ఆది శంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన రోజు.
9. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు.
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన రోజు.
🙏🌹🙏🌹🙏