Politics

21 స్థానాల్లో ఇప్పటివరకు వైసీపీ పార్టీ అక్కడ గెలవలేదు

21 స్థానాల్లో ఇప్పటివరకు వైసీపీ పార్టీ అక్కడ గెలవలేదు

మరి ఈ సారి పరిస్థితి ఏంటి!!!

రాష్టం లో మొత్తం టీడీపీ కంచుకోట స్థానాలు 21 ఉన్నాయి. ఈ 21 స్థానాల్లో ఇప్పటివరకు వైసీపీ పార్టీ ఒక్కటి గెలవలేదు.
అవేంటో ఒక సారి చూద్దాం.. రాష్ట్రం మొత్తం మీద రాయలసీమలో కుప్పం, హిందూపురం స్థానాల్లో కాంగ్రెస్, వైసీపీ ఇప్పటివరకు గెలవలేదు. ప్రకాశంలో చీరాల, కొండేపి, పరుచూరు, గుంటూరు 2 లో ఉపఎన్నికల్లో గెలిచినా తర్వాత మళ్లీ గెలవలేరు.

కృష్ణా జిల్లాలో గన్నవరం, విజయవాడ ఈస్ట్ ఎప్పుడు వైసీపీ గెలవలేదు. పశ్చిమ గోదావరిలో పాలకొల్లు, ఉండి, తూర్పు గోదావరిలో రాజమండ్రి రూరల్, పెద్దాపురం, రాజోలు, మండపేట, వైజాగ్ సిటీలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు, శ్రీకాకుళంలో టెక్కలి, ఇచ్చాపురం స్థానాల్లో ఇప్పటి వరకు వైసీపీ గెలవలేదు.

మొత్తం 175 సీట్లలో 21 సీట్లలో టీడీపీదే ఆధిపత్యం. వీటిల్లో వైసీపీ గెలవడం కష్టమే. విజయవాడ ఈస్ట్ సుధీర్ఘకాలం టీడీపీ గెలిచినా ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. గుంటూరు జిల్లాలో మాచర్ల, నరసరావుపేట, బాపట్ల, మంగళగిరి, గుంటూరు 1, స్థానాల్లో టీడీపీ గత 20 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గెలవలేదు. రాయలసీమలో కూడా టీడీపీ గెలవని ప్రాంతాలు చాలానే ఉన్నాయి.

ఇలాంటి సందర్భంలో కంచుకోట స్థానాలు ఏ పార్టీకి ఎక్కడ ఉన్నాయి. గత 20 ఏళ్లుగా అక్కడ వైసీపీ, కాంగ్రెస్ గెలవని ప్రాంతాలు ఏవీ.. టీడీపీ విజయం సాధించని ప్రాంతాలు ఇలా ఆయా ప్రాంతాలను అక్కడి పరిస్థితులను అంచనా వేసుకుంటున్నాయి టీడీపీ వైసీపీలు. రాబోయే ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల సమయంలో ఎలాంటి వ్యుహా ప్రతివ్యుహాలతో ముందుకెళతారనేది చూడాలి

అధికారం చేజిక్కించుకోవాలంటే ఈ సారి కంచుకోట స్థానాలను కూడా బద్దలు కొట్టి గెలవాలి. అలా చేయడానికి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యే పనితీరు, అవినీతి ఆరోపణలు, చేయాల్సి ఉన్న చేయని పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కావాల్సిన సౌకర్యాలపై దృష్టి సారించి ముందుకు వెళ్లాల్సిన అవసరముంది.