Kids

పరీక్షలు వ్రాసే విద్యార్థిని విద్యార్థులారా…

పరీక్షలు వ్రాసే విద్యార్థిని విద్యార్థులారా…

మీకు ఒక చిన్న కథ చెపుతాను వినండి….!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿అనగనగా………
      పూర్వం కొంతమంది యువకులు గుర్రాలపై వెళ్తుండగా వారికి ఒక ఋషి ఎదురుగా వచ్చి ఇలా చెప్పాడు .

🌸”ఓ యువకులారా.. మీకు ఇక్కడ నేలపై కనిపించిన వాటిని పోగుచేసుకుని సంచులలో వేసుకుని ఇంటికి వెళ్లండి.
ఆ సంచులను రేపు తెల్లవారుజామున తెరిచి చూస్తే మీకు ఓ మహాద్భుతంను చూస్తారు.

🌿ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే మీరు, సంతోషాతిరేకంతో చిందులు వేస్తారు. అయితే ఆ మరుక్షణమే భోరున ఏడుస్తారు” అని అన్నాడు.

🌸ఋషి మాటలు విన్న ఆ యువకులు, గుర్రాలపై నుంచి కిందికి దిగి, అటుఇటు చూశారు. వాళ్లకు నేలపై ఎంతదూరం చూసినప్పటికీ గులకరాళ్లు తప్ప మరేమీ కన్పించలేదు.

🌿అయినా ఋషి చెప్పాడు కనుక, మనిషికి నాలుగైదు గులకరాళ్లను సంచులలో వేసుకుని వెళ్లి, ఇంట్లో ఓ మూలన పెట్టి నిద్రపోయారు.

🌸మరుసటి రోజు ఉదయం సంచులను తెరిచి చూసిన ఆ యువకులు, ఋషి చెప్పినట్లు ఒక్కసారిగా సంతోషంతో వెర్రి కేకలు పెట్టారు.

🌿 అయితే ఆ మరుక్షణమే అయ్యో అని ఏడవసాగారు.
ఎందుకంటే, వాళ్లు మూటగట్టుకొచ్చిన గులకరాళ్లు వజ్రాలుగా మారిపోయాయి.

🌸ప్రస్తుతం వాళ్ల ఏడుపు, మనిషికి ఒక గోతాము రాళ్లను మూటగట్టక రాలేక పోయామే అని.

🌿చదువు కూడా అంతే… చదువుకునే వయసులో శ్రద్ధగా చదువుకుని వృద్ధిలోకి రావాలి.

🌸ఎందుకంటే, ఆ తర్వాత మనకు చదవాలని ఉన్నప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు అనుకూలించవు…స్వస్తి..🚩🌞🙏🌹🎻

🙏 సర్వేజన సుఖినోభవంతు🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿