Health

వడదెబ్బ అంటే ఏమిటి..? దాని నివారణ చర్యలు..!

వడదెబ్బ అంటే ఏమిటి..? దాని నివారణ చర్యలు..!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు వీపరీతంగా నమోదవుతున్నాయి. సూర్యుడు వేడికి ప్రజలు బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. కాబట్టి ప్రజలు వీలైనంత ఎక్కువగా ఇంట్లో ఉండేందుకు సిద్దపడండి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఎంత ఇంట్లో ఉందాం అనుకున్నప్పటికీ ఏదో ఒక పరిస్థితుల్లో ఎండలోకి రావడం తప్పడం లేదు. ఆ సమయంలో చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. అయితే వడదెబ్బ తగిలితే ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం..

వడదెబ్బ లక్షణాలు: సాధారణంగా చాలా మందికి వడదెబ్బ అంటే ఏంటో సరిగా తెలియకపోవచ్చు. ఏదో నీరసంగా ఉంది కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ అదే పొరపాటు. వడదెబ్బ తగిలిన వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే వారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. అయితే వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

* వడదెబ్బ తగిలిన వ్యక్తికి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. *

* వాంతులు, నీరసం, శరీరం పొడిబారటం లాంటివి జరుగుతాయి.

* కండరాల్లో తిమ్మిరి, శరీరంలో వాపు, అధికంగా చెమటలు పడతాయి

వడదెబ్బ తగిలితే చేయాల్సిన పనులు..

1. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడకు చేర్చాలి

2. శరీరానికి బాగా గాలి తగిలేలా చూడాలి

3. చల్లటి నీటిలో బట్టను ముంచి శరీరానికి బాగా అద్దాలి 4. ఉప్పు కలిపిన నీరు, మజ్జిగ, గ్లూకోజ్ నీళ్లు తాగించాలి.

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం బయటకు వెళ్లకపోవడం చాలా వరకు ఉత్తమం. అంతే కాకుండా అధిక మొత్తంలో వాటర్ తాగడం మంచిది.