Politics

భాగ్యనగర సిగలో మరో మకుటంగా తెలంగాణ నూతన సచివాలయం

భాగ్యనగర సిగలో మరో మకుటంగా తెలంగాణ నూతన సచివాలయం

హైదరాబాద్ : భిన్న సంస్కృతులను ప్రతిబింబించే నిర్మాణ శైలుల సమ్మేళనం. సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల కలబోత. కాకతీయ కళాఖండాలు, వనపర్తి సంస్థానాధీశుల ప్రాసాదాలు, రాజస్థానీ రాతి, గుజరాతీ రీతులతో కట్టిన కలల సౌధం. తెలంగాణ సంస్కృతి, జీవనస్థితులను అడుగడుగునా నింపుకుని… తాత్వికత, మార్మికత నిబిడీకృతమై దేదీప్యమానంగా ఆవిష్కృతమైందో… అద్భుత కట్టడం. ప్రాచీనయుగం నాటి ఆలయ గోపురాలు, మధ్యయుగం నాటి రాజభవనాలను ప్రతిబింబిస్తూ భాగ్యనగర సాగర తీరాన ఠీవీగా నిలిచింది…. ఈ అధునాతన పాలనాసౌధం. సీఎం కేసీఆర్‌ కార్యదక్షతతో… 4కోట్ల మంది ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పేలా తెలంగాణ ప్రజాసౌధం అద్భుతంగా రూపుదిద్దుకుంది.