Editorials

దేవాలయంలో ఎన్ని రకాల గంటలు ఉంటాయో తెలుసా..?

దేవాలయంలో ఎన్ని రకాల గంటలు ఉంటాయో తెలుసా..?

⚜ మన హిందూ దేవాలయాలలో గుడికి వెళ్లగానే మనకు గుడిలోని గంట దర్శనమిస్తుంది.
ఈ విధంగా ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు గంటను మ్రోగించి స్వామివారిని పూజిస్తుంటారు. గుడి ప్రాంతంలో ఉన్నంతసేపు ఆ గంటల శబ్దం మనకు కొంత ప్రశాంతతను కలిగిస్తుంది.
ఈ విధంగా గుడికి వెళ్ళిన భక్తులు గంట కొట్టడం ద్వారా ఆ దేవతలకు ఆహ్వానం పలికినట్లుని భావిస్తారు. అదే విధంగా మన మనసును దేవుడిపై ఉంచి భక్తిభావంతో నమస్కరించాలని దేవుని గుడిలో గంట మ్రోగిస్తూ ఉంటాము. ఈ విధంగా ఆలయానికి వెళ్లిన ప్రతి భక్తుడు లేదా మన ఇంట్లో పూజ సమయంలోనైనా గంటను మోగించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకి వివిధ ప్రాంతాలలో గంటలు కనిపిస్తాయి.

ఈ విధంగా గంటలు ఎన్ని రకాలు ఉంటాయో.. ఏ గంటను ఏ విధంగా ఉపయోగిస్తారో ఇక్కడ తెలుసుకుందాం….

⚜ మనం ఆలయంలోనికి వెళ్ళినప్పుడు మనకు ఆరు రకాల గంటలు దర్శనమిస్తాయి.

🔔 మొదటి గంట:
ఆలయ ప్రాంగణంలోకి వెళ్లగానే మనకు ధ్వజస్తంభం దగ్గర ఒక గంట కనిపిస్తుంది. దీనిని బలి అని పిలుస్తారు. పక్షులకు ఆహారాన్ని పెట్టే సమయంలో ఒక విధమైన రీతిలో ఈ గంటను మోగిస్తారు.

🔔 రెండవ గంట:
రెండవ గంట ఆలయంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు మోగిస్తారు.

🔔 మూడవ గంట:
మూడవ గంటను దేవుడికి మేలుకొలుపు పాట పాడుతున్న సమయంలో మోగిస్తారు.

🔔 నాలుగవ గంట:
ఈ గంట ఆలయం మూసివేసే సమయంలో మోగిస్తారు.

🔔 ఐదవ గంట:
ఈ గంట ఆలయంలో మంటపంలో మ్రోగించే గంట.

🔔ఆరవ గంట:
ఆరవ గంటను స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు మ్రోగించే గంట.
మనలో చాలా మంది స్వామివారికి హారతి ఇచ్చే సమయంలో స్వామివారికి ఎదురుగా ఉన్న గంట కొడుతుంటారు.
ఎలాంటి పరిస్థితుల్లో కూడా హారతి సమయంలో మంటపంలో ఉన్న గంటను మ్రోగించకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.