Fashion

చీర కట్టుతో లంగావోణీ

చీర కట్టుతో లంగావోణీ

చీరకట్టు సహజంగానే అందంగా ఉంటుంది. దాన్ని మరింత నవీనంగా తీర్చిదిద్దేలా, సంప్రదాయ చీరకు స్టైలిష్ లుక్‌ తీసుకువచ్చేలా.. కొత్తకొత్త చీరకట్లు ట్రెండవుతున్నాయి. యూనిక్‌ శారీ డ్రేపింగ్‌ స్టైలిష్ పేరుతో పాపులర్‌ అవుతున్నాయి. చీరను లంగావోణీలా, ఫ్యాషనబుల్‌ గౌన్‌లా, లెహెంగా జాకెట్‌లా.. కనికట్టు చేస్తూ కట్టడమెలాగో చెబుతున్నాయి. ఈ యూట్యూబ్‌ పాఠాలు ఆడపిల్లలను చూడచక్కని మార్చ్‌ఫాస్ట్‌కు సిద్ధం చేస్తున్నాయి.

చీరకట్టు సహజంగానే అందంగా ఉంటుంది.దాన్ని మరింత నవీనంగా తీర్చిదిద్దేలా, సంప్రదాయ చీరకు స్టైలిష్ లుక్ తీసుకువచ్చేలా.. కొత్తకొత్త చీరకట్లు ట్రెండవుతున్నాయి. యూనిక్ శారీ డ్రేపింగ్ నైస్టెల్స్ పేరుతో పాపులర్ అవుతున్నాయి. చీరను లంగావోణీలా, ఫ్యాషనబుల్ గౌన్లా, లెహెంగా జాకెట్లా.. కనికట్టు చేస్తూ కట్టడమెలాగో చెబుతున్నాయి. ఈ యూట్యూబ్ పాఠాలు ఆడపిల్లలను చూడచక్కని మార్చ్ ఫాస్ట్కు సిద్ధం చేస్తున్నాయి.

చీర కట్టుకోవాలంటే చీర కావాలి, లంగావోణీ వేసుకోవాలంటే లంగావోణీనే ఉండాలి… అనుకుంటే ఇప్పుడు తప్పే. పర్ఫెక్ట్ లంగావోణీని చీరతోనూ కట్టొచ్చు. అదే చీరతో మాడ్రన్ డ్రెస్ను సృష్టించొచ్చు. లాంగ్ గౌన్ న్నూ ఆవిష్కరించొచ్చు. ‘ఇలా ఎలా కట్టారబ్బా?’ అనిపించేలా మత్స్యకన్యను తలపిస్తూ మెర్మెయిడ్, రివర్స్ మెర్మెయిడ్ స్టెళ్లనూ ట్రై చేయొచ్చు. ఇప్పుడవన్నీ ప్రయత్నించేందుకు ఒక్క చీర ఉంటే చాలు. యూట్యూబ్లో చూసి మీకు నచ్చిన వస్త్రధారణలో ముస్తాబయిపోవచ్చు.

యూట్యూబ్… ముచ్చటైన వంటిల్లు, పాటల పొదరిల్లు, ముగ్గుల హరివిల్లు, కొత్త సంగతుల చిరుజల్లు. ఇప్పుడు సంప్రదాయ చీరకట్టును సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నది. చీరను విభిన్నంగా మడతపెడుతూ రకరకాల దుస్తుల రూపాలు ఎలా తీసుకురావాలో చూపుతున్నది. ఉదాహరణకు మనకు బాగా ఇష్టమైన లంగావోణీనే తీసుకుందాం. లోపలి వరుస చీరను నడుం దగ్గర దోపి రెండో వరుసను మళ్లీ నడుం దాకా తీసుకువచ్చి కుచ్చులు పోసి చీరకడతాం. దాని బదులు… ఇందులో, చుట్టూ చీరను ఒక్కో కుచ్చూ పెడుతూ దాన్ని దోపుతూ ఫ్రిల్స్తో వచ్చే లంగాలా కనిపించేలా చేస్తారు. తర్వాత పవిటకు పిన్ను పెట్టి నడుం దగ్గరి చీరను ఓణీ అంచులా దోపుతారు.. ఇంకేం, అది చీర అని చెబితేగానీ అర్థం కానంతగా.. అచ్చమైన లంగావోణీలా కనిపిస్తుంది. వెస్ట్రన్ డ్రెస్ తరహాలో కనిపించే చీరకట్లూ ఉన్నాయి. ప్రతి ఫంక్షన్కి ఒకేలాంటి చీర బోర్ కొట్టినప్పుడు ఇలా ప్రయత్నిస్తే సరి… ఏమంటారు?!