Politics

తెలంగాణ బిజెపి ఎజెండాలో గల్ఫ్ ప్రవాసీయుల సమస్యలు

తెలంగాణ బిజెపి ఎజెండాలో గల్ఫ్ ప్రవాసీయుల సమస్యలు

బండి సంజయ్ తో గల్ఫ్ ప్రతినిధుల సమావేశం

గల్ఫ్ దేశాలలో ప్రవాసీయులు ఎదుర్కోంటున్న సమస్యలు మరియు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారి పునరావాస విషయమై హామిలతో గల్ఫ్ ప్రవాసీయులను మరియు వారి కుటుంబాలను ఆకట్టుకోవాలని తెలంగాణ బిజెపి ప్రయత్నిస్తుంది.

రానున్న ఎన్నికలలో గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి సంబంధించిన ఆంశాలను తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో బిజెపి గల్ఫ్ విభాగం అధ్యక్షుడు పన్నీరు నరేంద్ర సోమవారం చర్చించారు. బిజెపికు బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ మరియు హైద్రాబాద్ నగరం నుండి పెద్ద సంఖ్యలో గల్ఫ్ వలసలు ఉన్నందున ఈ దిశగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లుగా సమావేశనంతరం నరేంద్ర వెల్లడించారు.

నరేంద్రతో పాటు ఒమాన్ బిజెపి కార్యదర్శి అంజి గంగాధర్, జగిత్యాల జిల్లా బిజెపి కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ లు కూడ ఉన్నారు.