అక్కినేని హీరో కింగ్ నాగార్జున ఎక్కువగా ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒకే మూస ధోరణిలో సినిమాలు చేయడానికి ఇష్టపడరు. ఫెయిల్యూర్స్ వచ్చిన కూడా కొత్త దర్శకులతో కొత్త కథలతో సినిమాలు చేయడం టాలీవుడ్ అందరికంటే ముందుగా కింగ్ నాగార్జున స్టార్ట్ చేశారు.
శివ అనే సినిమా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది అంటే దానికి కారణం నాగార్జున అని చెప్పాలి. ఎవరూ నమ్మని ఆ కథని నాగార్జున నమ్మి చేశారు. అయితే నాగార్జున కెరియర్ లో కొన్ని హిట్ సినిమాలని కూడా కోల్పోయాడని చెప్పాలి. ఇతర సినిమాల షెడ్యూల్స్ కారణంగా ఇంట్రెస్ట్ ఉన్న చేయలేకపోయిన ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి.
అలాంటి వాటిలో గ్యాంబ్లర్ ఒకటి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో అజిత్ అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ కంప్లీట్ గా గ్రేషేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ తోనే నడుస్తుంది. అజిత్ కెరియర్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. కోలీవుడ్ లో గ్రే షేడ్స్ హీరోయిజం తో వచ్చిన మొదటి సినిమా గ్యాంబ్లర్ అని చెప్పాలి.
ఇదిలా ఉంటే తాజాగా వెంకట్ ప్రభు కస్టడీ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. గ్యాంబ్లర్ సినిమాలో అర్జున్ పోషించిన పోలీస్ ఆఫీసర్ రోల్ కోసం ముందుగా నాగార్జున ని అనుకున్న. అతనిని దృష్టిలో ఉంచుకొని కథలో ఆ పాత్రని డిజైన్ చేశాను. ఇక స్టొరీ కూడా నాగార్జున కి నేరేట్ చేయడం జరిగింది.
ఆయనకి నచ్చింది కూడా. అయితే ఇతర సినిమాల కమిట్మెంట్స్ ఉండటంతో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక గ్యాంబ్లర్ మూవీ చేయలేకపోయారు. తరువాత ఆ పాత్రలో కొన్ని మార్పులు చేసి అర్జున్ ని సెట్ అయ్యే విధంగా మార్చడం జరిగిందని దర్శకుడు వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాలో నాగార్జున నటించి ఉంటే మాత్రం వేరే లెవల్ లో ఉండేది అనే మాట అక్కినేని అభిమానుల నుంచి వినిపిస్తోంది.