Agriculture

ఈ దేశీయ ఆవులను పెంచుకోండి..

ఈ దేశీయ ఆవులను పెంచుకోండి..

భారతదేశంలో రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణను కూడా ప్రధాన వృత్తిగా స్వీకరిస్తారు. దేశంలో కోట్లాది మంది రైతుల జీవనోపాధి పశుపోషణతో ముడిపడి ఉంది. రైతులు నెయ్యి, పెరుగు, వెన్న, పాలు, మజ్జిగ అమ్మడం ద్వారా ఆర్ధిక స్వలంభన పొందుతారు. కొందరు బాగా సంపాదిస్తున్నారు. ఇంటి ఖర్చులకు పశువుల పెంపకంతో డబ్బులను సంపాదించే అన్నదాతకు ఏ జాతి ఆవులనుకొంగలు చేయాలి.. ఎలాంటి ఆవులను పెంచాలనేది పెద్ద సమస్య . మేలు జాతి ఆవుల పెంపకం ద్వారా ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి. అయితే చాలామంది రైతులకు సీజన్, వాతావరణాన్ని బట్టి ఎక్కువ పాలు ఇవ్వడానికి ఏ జాతి ఆవులు మంచివో తెలియదు. ఈ రోజు మనం మేలు జాతి ఆవులు, అధికంగా పాలు ఇచ్చే దేశీయ ఆవుల గురించి తెలుసుకుందాం..

వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆవుల పెంపకం కోసం రైతులకు సబ్సిడీ ఇస్తున్నాయి. ఇందుకోసం రైతులకు వేల రూపాయలు ఉచితంగా అందజేస్తున్నాయి. అదే సమయంలో.. అనేక రాష్ట్రాల్లో ఆవుల పెంపకం చేపడుతున్న రైతులకు ప్రోత్సాహక మొత్తాన్ని కూడా ఇస్తున్నారు.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి ఆవు పేడ, గోమూత్రాన్ని కొనుగోలు చేస్తోంది. ప్రతిఫలంగా రైతులకు కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. రైతు సోదరులు అధునాతన జాతి ఆవుల పెంపకాన్ని చేపడితే.. పాల ఉత్పత్తులను విక్రయించడంతో పాటు ఆవు పేడ, ఆవు మూత్రం అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. దేశీయ ఉత్తమమైన 3 జాతుల ఆవుల గురించి తెలుసుకుందాం.

గిరి ఆవు: గిరి ఆవు దేశీయ జాతి ఆవు. అధికంగా పాలు ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. దీని పాలు చాలా ఖరీదైనవి. ఈ జాతి ఆవులు గుజరాత్, మహారాష్ట్ర , రాజస్థాన్‌లలో కనిపిస్తాయి. అయిదు గిరి ఆవుల జన్మ ప్రదేశం గుజరాత్‌లోని గిర్ అడవులు. అందుకే దీనిని గిరి ఆవు అంటారు. ఈ ఆవు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ఆవు ప్రత్యేకత ఏమిటంటే అది వేడి వాతావరణాన్ని సులభంగా తట్టుకోగలదు. రోజూ 15 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఈ జాతికి చెందిన ఆవు స్వాతంత్య్రానికి పూర్వం బ్రెజిల్‌కు పంపబడింది. రైతు సోదరులు గిరి ఆవును సంరక్షిస్తూ.. పెంపకం చేపడితే మంచి పాల ఉత్పత్తిని పొందవచ్చు. పాలు సహా.. పేద, మూత్రం అమ్మి బాగా సంపాదించవచ్చు.

సాహివాల్ ఆవు: గిరి ఆవులు మాదిరిగానే సాహివాల్ కూడా దేశీయ ఆవు జాతి. ఈ జాతి ఆవు జన్మ ప్రదేశం పాకిస్తాన్. ఈ ఆవు శరీరం పొడవుగా, బలిష్టంగా ఉంటుంది. రోజూ 10 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఈ ఆవుని సంరక్షిస్తే.. పాలు ఇచ్చే సామర్థ్యం పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో సాహివాల్ ఆవును రైతులు పెంచుతున్నారు.

రెడ్ సింధీ ఆవు: ఈ జాతి ఆవు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ఆవు మూలం పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్. అయితే ఈ రెడ్ సింధీ ఆవులను ప్రస్తుతం హర్యానా, పంజాబ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా పెంచుతున్నారు. ఈ ఆవు 12 నుండి 20 లీటర్ల పాలు ఇస్తుంది. రైతులు రెడ్ సింధీ ఆవు పెంపకం చేపడితే.. పాలు అమ్మడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు.