NRI-NRT

అమెరికాలో తెలుగు యువతి అదృశ్యం…

అమెరికాలో  తెలుగు యువతి  అదృశ్యం…

అమెరికాలో భారత సంతతి మహిళ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్‌ రాష్ట్రంలో ఉంటున్న 25 ఏళ్ల లహరి పతివాడ.. ఐదు రోజుల క్రితం విధులకు వెళ్తూ అదృశ్యమయ్యారు. ఆ మరుసటి రోజే టెక్సాస్‌కు 322 కిలోమీటర్ల దూరంలో ఒక్లహోమా రాష్ట్రంలో శవమై కనిపించారు. టెక్సాస్‌లోని కొలిన్స్‌ కౌంటీ మెక్‌ కిన్నీ శివారులో లహరి నివాసం ఉంటున్నారు. ఈమె చివరిసారిగా డల్లాస్ శివారులోని ఎల్ డోరాడో పార్క్ వే, హార్డిన్ బౌలేవార్డ్ ప్రాంతంలో తన బ్లాక్ టయోటాను నడుపుతూ కనిపించారు.. ఓవర్‌ల్యాండ్‌ పార్క్‌ రీజినల్‌ మెడికల్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారు. అయితే మే 12న లహరి తన విధులు ముగించుకుని ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.అయితే లహరి ఫోన్ ఓక్లహోమాలో ట్రాక్ కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు విషయాన్ని పోలీసులకు తెలిపారు.

అయితే మే 13న తన ఇంటికి దాదాపు 322 కిలోమీటర్ల దూరంలోని ఓక్లహోమా రాష్ట్రంలో లహరి శవమై కనిపించింది. మృతురాలి ఫేస్‌బుక్ పేజీ ప్రకారం.. ఓవర్‌లాండ్ పార్క్ ప్రాంతీయ వైద్య కేంద్రంలో లహరి పనిచేస్తున్నారు. ఆమె టెక్సాస్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలయ్యారు. బ్లా వ్యాలీ వెస్ట్ హైస్కూల్‌లో చదువుకున్నారు .లహరి ఆకస్మిక మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే లహరి మరణానికి కారణమైన అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ఎక్కడ కనిపించింది అనే దానితో పాటు మిస్సింగ్ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి వుంది.