Movies

సూపర్ స్టార్ సినీ కెరీర్ ను ముగించాలని నిర్ణయించుకున్నాడట…

సూపర్ స్టార్  సినీ కెరీర్ ను ముగించాలని నిర్ణయించుకున్నాడట…

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం పలు సినిమాలు రూపొందుతున్నాయి. అందులో మొదటగా జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ వెంటనే లాల్ సలామ్ అనే విభిన్నమైన సినిమా తో రజినీకాంత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ విభిన్నమై గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.

ఈ రెండు సినిమాల తర్వాత రజినీకాంత్ నటించబోతున్న సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడు. విక్రమ్ సినిమా తో తమిళనాట ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకున్న లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం లియో సినిమాను విజయ్ హీరోగా రూపొందిస్తున్న విషయం తెల్సిందే.

తమిళ స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు దాదాపు అంతా కూడా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఆయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. అంతే కాకుండా స్వయంగా లోకేష్ కనగరాజ్ ను తనతో సినిమా చేయమని రజినీకాంత్ అడిగినట్లుగా తెలుస్తోంది.

రజినీకాంత్ తో లోకేష్ కనగరాజ్ సినిమా వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా గురించి ప్రముఖ తమిళ ఫిల్మ్ మేకర్ మిస్కిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తలైవర్ 171వ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

అంతే కాకుండా ఆయన మాట్లాడుతూ… లోకేష్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా తో రజినీకాంత్ తన సినీ కెరీర్ ను ముగించాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయాన్ని ఇప్పటికే సన్నిహితుల వద్ద వెల్లడించినట్లు తెలుస్తోంది. వయసు మీద పడటంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా రజినీ కాంత్ సినిమాలు ఎక్కువ చేయలేక పోతున్నాడు.

అందుకే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా తర్వాత రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా హిట్ అయితే రజినీకాంత్ ఇండస్ట్రీకి దూరం అయినా పర్వాలేదు. కానీ ఆ సినిమా ఫలితం తారుమారు అయినా కూడా ఇండస్ట్రీకి దూరం అవ్వద్దు అంటూ కొందరు కోరుకుంటున్నారు. ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.