Politics

మహారాష్ట్ర ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బోణి..

మహారాష్ట్ర ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బోణి..

తెలంగాణకు ఆవతల బీఆర్ఎస్ BRS తొలిసారి గెలుపు రుచి చూసింది. మహారాష్ట్రలో ఓ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన అభ్యర్థి విజయం సాధించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ శిక్షణ శిబిరం ప్రారంభమైన తొలి రోజే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

ఔరంగాబాద్ Aurangabad సమీపంలోని గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు గురువారం ఉప ఎన్నిక జరగ్గా నిన్న ఫలితం వెలువడింది. బీఆర్ఎస్ BRS బలపర్చిన అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.