NRI-NRT

బైడెన్‌ను చంపుతానన్న తెలుగు కుర్రాడికి పదేళ్ల జైలుశిక్ష!..

బైడెన్‌ను చంపుతానన్న తెలుగు కుర్రాడికి పదేళ్ల జైలుశిక్ష!..

అమెరికా (America) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)ను చంపుతానంటూ వైట్‌హౌస్ (White House) పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టిన తెలుగు యువకుడు సాయివర్షిత్‌(Saivarshit)కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష(Ten years imprisonment), 2 కోట్ల (2 crores) జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ కోర్టు (Federal Court)న్యాయమూర్తి రాబిన్ మెరివెదర్ (Robin Meriwether) సాయివర్షిత్‌కు మే 30 దాకా కస్టడీ విధించారు.

సాయివర్షిత్ మిసోరీ రాష్ట్రంలో నివసిస్తుంటాడు. అతడు గతంలో డేటా అనలిస్ట్‌గా పనిచేశాడు. సోమవారం రాత్రి అతడు ఓ భారీ ట్రక్‌(
truck) నడుపుతూ శ్వేత సౌధం పరిసరాల్లోకి దూసుకొచ్చాడు. వైట్‌హౌస్‌(White House)లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నంలో అక్కడున్న బారికేడ్లను ఢీకొట్టాడు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసుల(police)కు అతడి ట్రక్‌లో జర్మనీ (Germany) నియంత హిట్లర్‌(Hitler)కు చెందిన నాజీ పార్టీ జెండా కూడా కనిపించింది. బైడన్‌ను చంపి అమెరికా పగ్గాలు చేపట్టడమే తన లక్ష్యమని సాయి వర్షిత్ (Sai Varshit) పోలీసులకు చెప్పాడు. తానో డేటా అనలిస్ట్‌ (Data Analyst) అని చెప్పిన సాయివర్షిత్ ప్రస్తుతం తాను నిరుద్యోగినని చెప్పాడు. పోలీసులు నిందితుడిపై ఆస్తుల విధ్వంసం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అధ్యక్షుడిని చంపుతానని బెదిరించడం, అనుమతి లేకుండా వైట్‌హౌస్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేయడం తదితర అభియోగాలను మోపారు.

బుధవారం నారింజ రంగు జైలు దుస్తుల్లో కోర్టుకు హాజరైన సాయివర్షిత్(Sai Varshit), న్యాయమూర్తి అడిగిన సమాధానాలకు వినయంగా క్లుప్తంగా సమాధానాలు ఇచ్చాడు. అయితే, ఈ కేసులో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటూ 2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయమూర్తి సాయివర్షిత్‌కు వివరించారు.