ఆకాశగంగాజలమును సూర్యుడు గ్రహించి ఆకాశమందు మేఘము లేని సమయమందు భూమియందు హఠాత్తుగా తన కిరణములచే చిమ్ముచుండును.
🪷 అట్టి గంగా శీకర(తుంపర) స్పర్శచే మానవుడు నిర్ధూతపాపపంకము కలవాడైననూ నరకమును పొందడు.
🪷అందుచేత ఇది దివ్య స్నానం అని చెప్పబడును. సూర్యుడు చూడబడుచుండగా మేఘములు లేకయే ఆకాశము నుండి ఏ జలము పడునో అది సూర్యకిరణములచే చిమ్మబడుచున్న ఆకాశ గంగాజలమే యగుచున్నది.
స్నానములు పంచ విధములు💦💦💦
1. ఆగ్నేయము (విభూతిని శరీరమంతట పూసికొనుట),
2. వారుణము (జలమున మునుగుట),
3. బ్రాహ్మము (ఆపోహిష్ఠేత్యాధి మంత్రము నుచ్చరించుచు దర్భలతో జలమును మార్జనము చేసికొనుట),
4. వాయవ్యము (సాయం సమయమున గోవుల డెక్కలనుండి లేచిన ధూళి తలపై బడునట్లు చేసికొనుట),
5. దివ్యము (ఎండలో వాన కురియుచుండగా నందు శరీరమును తడుపుట).