Politics

రిటైర్మెంట్ ఇచ్చా కానీ నా మాటలకు కాదు అని వెంకయ్య నాయుడు వ్యాక్యాలు….

రిటైర్మెంట్ ఇచ్చా కానీ నా మాటలకు కాదు  అని వెంకయ్య నాయుడు వ్యాక్యాలు….

పదవికి మాత్రమే విరమణ ఇచ్చానని..మాట్లాడే పెదవులకు విరమణ లేదు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  అన్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. రాజకీయ నాయకులు డైపర్లు మార్చినట్లుగా పార్టీలు మార్చేస్తున్నారని వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున ఉన్న పార్టీ లో సాయంత్రం వరకు ఉంటారో లేదో తెలియడం లేదని మండిపడ్డారు.

కేవలం నమ్మిన సిద్ధాంతంకు కట్టుబడి ఉండేవాళ్లు మాత్రమే రాజకీయాల్లోకి రావాలన్నారు వెంకయ్యనాయుడు. యువతకు రాజకీయ పాటశాలలో శిక్షణ కావాలని వెల్లడించారు. యువతను (Youth) మేల్కొల్పడం అంటే తనకు ఎంతో ఇష్టమైన పని చెప్పారు. అలాగే ప్రజలతో గడపడం కూడా తనకు ఇష్టమని.. అందుకే వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులోనే ఉంటానని చెప్పుకొచ్చారు.

ప్రపంచంలోనే యువ శక్తి ఎక్కువగా ఉన్న దేశం భారత్  అని వెల్లడించారు. దేశంలో పురుషులతో పాటు స్త్రీలు పోటీ పడి మరీ దూసుకుపోతున్నారని తెలిపారు. విద్యావిధానాన్ని భారతీయకరణ చేయాలని అన్నారు. ప్రపంచంలో వస్తున్న మార్పులతో ఉపాధి అవకాశాలతో పాటు పోటీ తత్వం, సవాళ్లు కూగా పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. యువత క్రమశిక్షణ, కష్టపడే తత్వం, కలుపుగోలుగా ఉండటం అలవర్చుకోవాలని సూచించారు. పాశ్చాత్య దోరణి మన దేశానికి, యువతకు మంచిది కాదని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. భారతీయ ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. యోగా  అనేది యువత జీవితంలో ఒక భాగం కావాలని పేర్కొన్నారు. యోగా మతానికి సంబంధించిన అంశం కాదని.. ప్రపంచం ఆచరిస్తున్న ఆరోగ్య మంత్రమని వెంకయ్య నాయుడు వెల్లడించారు.