Business

పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు-TNI నేటి వాణిజ్య వార్తలు

పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు-TNI నేటి వాణిజ్య వార్తలు

8 శాతం పెరిగిన ఇళ్ల ధరలు

ముడి సరుకుల ధరలు భారం కావడం, డిమాండ్ కారణంగా దేశవ్యాప్తంగా నివాస గృహాల ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ అనరాక్ రీసెర్చ్ తాజా డేటా ప్రకరం, దేశంలోని ప్రధాన ఏడు మార్కెట్లలో జూన్ చివరి నాటికి ఇళ్ల ధరలు గతేడాది కంటే 8 శాతం పెరిగాయి. ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్, పూణె, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులలో సగటున నివాసాల ధరలు గతేడాది జూన్ నాటికి చదరపు అడుగుకు రూ. 6,001 నుంచి రూ. 6,470కి చేరింది.

పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.100 పెరగడంతో రూ.53,950గా ఉండగా.. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.100 పెరగడంతో రూ.58,750గా ఉంది. ఇక వెండి ధర కేజీకి రూ.500 తగ్గడంతో రూ.74,800 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. విదేశీ ఇన్వెస్ట్ మెంట్ల వెల్లువతో పాటు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు ఉండటం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 803 పాయింట్లు లాభపడి 64,718కి చేరుకుంది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 19,189కి ఎగబాకింది. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 64,768 పాయింట్ల గరిష్టాన్ని తాకింది

విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్

సాధారణంగా వివిధ పనులపై విదేశాలకు వెళ్లే వారు, లేదా కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లే వారు ముందుగానే విమాన టికెట్లను బుక్ చేసుకుంటారు. అయితే ఇలా చేసే వారు కనుక ఈ రోజే విమాన టికెట్ల బుక్ చేసుకుంటే టీసీఎస్ పన్ను మినహాయింపు లభిస్తుంది. కేంద్ర బడ్జెట్ 2023 టూర్ ప్యాకేజీల బుకింగ్‌లతో సహా విదేశీ రెమిటెన్స్‌లపై వసూలు చేసే పన్ను (టీసీఎస్) రేటును మొత్తం లావాదేవీ మొత్తంలో 5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. పెంచిన పన్ను జూలై 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. మీరు రూ. 50,000తో విమానాన్ని బుక్ చేసుకుంటే రేపటి నుంచి సంబంధిత టీసీఎస్ మొత్తం రూ. 10,000 అవుతుంది. ఇది విమాన ఛార్జీలో 20 శాతంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజే మీరు విమాన టిక్కెట్ బుక్ చేసుకంటే రూ.10,000 మినహాయింపు లభిస్తుంది. ఈ 20 శాతం టీసీఎస్ నియమం విదేశీ టూర్ ప్యాకేజీలకే కాకుండా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే అంతర్జాతీయ లావాదేవీలకు కూడా ఇది వర్తిస్తుంది.

విదేశాల నుంచి పంపే డబ్బుపై పన్ను పెంపు

పన్ను వసూలు నిబంధనలు మారుతున్నాయి. ట్యాక్స్‌ కలెక్షన్‌ సోర్స్‌ (టీసీఎస్‌) నిబంధనలలో మార్పులు చేస్తున్నట్లు గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రచురించింది. ఈ నిబంధన జూలై నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ.. కొత్త టీసీఎస్ కలెక్షన్ రేటు అక్టోబర్ 1.కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, “జులై 1 నుండి అమలులోకి రావాల్సిన TCS రేటు పెంపు అక్టోబర్ 1, 2023 నుండి అమలులోకి రాబోతోంది. ఒక్కో వ్యక్తికి ఏడాదికి రూ.7 లక్షల వరకు విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS 5 శాతం విధించబడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది

ట్విటర్‌కు 50లక్షల జరిమానా వేసిన కర్ణాటక హైకోర్టు

కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో ట్విటర్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని సామాజిక మాధ్యమాల ఖాతాలను, ట్వీట్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ట్విటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు (Karnataka High court) శుక్రవారం తోసిపుచ్చింది. అంతేకాకుండా ఆ కంపెనీకి రూ.50 లక్షలు జరిమానా విధించింది

ఈ నగరంలోనే ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువ

భారత్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ (online shopping) చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. మన దేశంలో అమెజాన్‌ (Amazon), మీషో (Meesho)తో పాటు ఇతర షాపింగ్‌ యాప్‌లలో ఏ నగర ప్రజలు అత్యధిక సమయాన్ని వెచ్చిస్తున్నారో తెలుసా? మన ఐటీ హబ్‌ బెంగళూరు వాసులు దీనిలో ముందున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఫ్లాట్‌ఫాం అమెజాన్‌లో అత్యధిక సమయం గడిపే నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది.

యూట్యూబ్ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం

ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ ‘యూట్యూబ్’ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రకటనల ఆదాయం తగ్గిపోతోంది. దీంతో తన ప్లాట్ ఫామ్ లో ఎన్నో మార్పులు చేస్తోంది. ఉచిత వీడియోల్లో ప్రకటన సంఖ్య పెంచుతోంది. అంటే ఇకమీదట మనం వీడియోలను చూసే సమయంలో ఎక్కువ ప్రకటనలు కనిపించనున్నాయి. దీనివల్ల సంస్థకు రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి ప్రకటనల ఆదాయం పెరుగుతుంది. ఇన్నేసి ప్రకటనలు అడ్డుగా ఉన్నాయని అనిపిస్తే నెలవారీ చందా చెల్లించి ప్రకటనలు లేని సబ్ స్క్రిప్షన్ తీసుకునేలా వారిని ప్రోత్సహించనుంది. అలా కూడా యూట్యూబ్ కు ఆదాయం లభిస్తుంది.ప్రకటనల ఆదాయం తగ్గడానికి ఒక కారణం కూడా ఉంది. కొందరు యూజర్లు యాడ్ బ్లాకర్ టూల్స్ వాడుతున్నట్టు యూట్యూబ్ గుర్తించింది. దీనివల్ల యూట్యూబ్ వీడియోలను ఉచితంగానే ప్రకటనలు లేకుండా చూసుకోవచ్చు. ఇలాంటి యూజర్లపై చర్యలు తీసుకుంటోంది. యాడ్ బ్లాకర్ ను డిసేబుల్ చేసుకోవాలని లేదంటే, చూసే వీడియోల పరంగా పరిమితులు విధిస్తామంటూ హెచ్చరిక సందేశాలు పంపిస్తోంది. మూడు వీడియోలు చూసిన వెంటనే వీడియో బ్లాకర్ అప్లయ్ అవుతుందని స్పష్టం చేసింది. అంటే యాడ్ బ్లాకర్ సాఫ్ట్ వేర్ టూల్స్ వాడే వారు మూడు వీడియోలను మించి చూడలేరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఉచిత వీడియోల కంటెంట్ ను అందించేందుకు ప్రకటనల అవసరాన్ని యూట్యూబ్ గుర్తు చేసింది.

* చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచిన కేంద్రం

ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎంపిక చేసిన పథకాలపై పెంచిన రేట్ల వివరాలను శుక్రవారం ప్రకటించింది. ఏడాది, 2 ఏళ్ల టర్మ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై స్వల్ప సర్దుబాటుతో వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. దాంతో జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు 4 శాతం నుంచి 8.2 శాతం మధ్య ఉంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

నిఖిల్ ‘స్పె’ కలెక్షన్లు ఎంతంటే?

యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమా టాలీవుడ్ నిన్న రిలీజ్ అవ్వగా.. పాజిటివ్ టాక్తో దూసుకెళ్తంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా.. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.11.7 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఆర్యన్ రాజేశ్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమటం కీలక పాత్రలు పోషించారు.